మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: అల్లూరి జిల్లాలో విషాదం.. తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..!

ABN, Publish Date - Feb 13 , 2024 | 07:45 PM

జిల్లాలోని అరకు లోయ సమీపంలో ఉన్న హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. మృతిచెందిన బాలికను దుంబ్రిగూడ మండలం ఓంబి గ్రామానికి చెందిన వసంతగా గుర్తించారు.

 AP NEWS: అల్లూరి జిల్లాలో విషాదం.. తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..!

అల్లూరి: జిల్లాలోని అరకు లోయ సమీపంలో ఉన్న హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. మృతిచెందిన బాలికను దుంబ్రిగూడ మండలం ఓంబి గ్రామానికి చెందిన వసంతగా గుర్తించారు. ఆమె ఇంటికి వెళ్లి ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నమే తిరిగి హాస్టల్‌కు వచ్చింది. తన తండ్రి ఒక హత్య కేసులో సెంట్రల్ జైలు నుంచి ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆయనను చూసేందుకు వసంత వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

హాస్టల్లోకి వచ్చిన అరగంటలోపే భోజనం చేయకుండా రూంలోకి వెళ్లి వసంత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తోటి విద్యార్థినులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్‌కు ఈ విషయాన్ని తెలియజేయగా స్కూల్ యాజమాన్యం పోలీసులకు తెలిపారు. అప్పటికే వసంత చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అరకులోయ ప్రాంతీయ వైద్య విధాన ఆస్పత్రికి తరలించారు. వసంత మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 08:36 PM

Advertising
Advertising