ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం

ABN, Publish Date - Dec 21 , 2024 | 12:35 AM

స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

  • విభాగాల అధిపతులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని మేయర్‌ను కోరిన స్టాండింగ్‌ కమిటీ సభ్యులు

  • తాత్కాలిక కార్మికులకు వేతనాలు చెల్లించే స్వయం సంఘాలకు రెండు శాతం కమీషన్‌ ఎందుకిస్తున్నారని నిలదీత

  • ఐదారు మినహా 69 అంశాలకు ఆమోదం

విశాఖపట్నం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై ఎజెండాలో పొందుపరిచే అంశాలకు సంబంధించిన విభాగాల అధిపతులు సమావేశానికి తప్పనిసరిగా హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని మేయర్‌ను కోరారు.

మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన శుక్రవారం స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. జోన్‌-5, జోన్‌-6 పరిధిలో రోడ్లను శుభ్రపరిచేందుకు తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్న కార్మికులకు వేతనాల చెల్లింపు, మరో 30 రోజులపాటు వారి సేవల పొడిగింపు అంశంపై కమిటీ సభ్యులు చర్చించారు. కార్మికులను ఎవరు నియమించారు?, వారికి వేతనాలను ఎవరి ద్వారా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాన వైద్యాధికారి గానీ ఆయా జోన్ల సహాయ వైద్యాధికారులుగానీ అందుబాటులో లేకపోవడంతో జోన్‌-6కి చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఒకరు సమాధానం ఇచ్చారు. కార్మికులను ఎవరు నియమించారనేది తనకు తెలియదని, వేతనాలను మాత్రం స్వయం సహాయక సంఘాల ద్వారా జీవీఎంసీ చెల్లిస్తున్నట్టు చెప్పారు. తాత్కాలిక కార్మికులకు వేతనాల చెల్లింపులో భాగంగా నోడల్‌ స్వయం సహాయక సంఘాలకు రెండు శాతం కమీషన్‌ ఎందుకు ఇస్తున్నారని అధికారులను స్టాండింగ్‌ కమిటీ సభ్యులు నిలదీశారు. ఆదాయ పన్ను కింద రెండు శాతం ఇస్తున్నందున అదనంగా సర్వీస్‌ చార్జీ పేరుతో మరో రెండు శాతం ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఐటీ కింద ఇచ్చే రెండు శాతం ఆయా సంఘాల ఖాతాల్లోనే ఉంటుంది కాబట్టి, సర్వీస్‌ చార్జీ పేరుతో ప్రత్యేకంగా కేటాయింపులు జరపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇకపై సర్వీస్‌ చార్జీ లేకుండా ఆదేశాలు ఇవ్వాలని మేయర్‌ను సభ్యులు కోరారు. అలాగే ఇప్పటికే పారిశుధ్య నిర్వహణకు 6,500 మందికి పైగా కార్మికులు ఉన్నందున, ఇకపై అవసరమైతే తప్ప రొటీన్‌గా వారి సేవలను పొడిగించాలంటే కుదరదని సభ్యులు స్పష్టంచేశారు. కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ డేగా రోడ్డుతోపాటు పోర్టు ఫైఓవర్‌ బ్రిడ్జిలను శుభ్రం చేసే కార్మికులకు జీవీఎంసీ వేతనాలు చెల్లించడంపై సభ్యులు అధికారులను నిలదీశారు. పోర్టు అవసరాలు తీరుస్తున్న రోడ్ల నిర్వహణను జీవీఎంసీ చూడాలంటే సీఎస్‌ఆర్‌ కింద నిధులు రాబట్టాలని అధికారులకు సూచించారు. అలాగే గాజువాక నుంచి చెట్ల వ్యర్థాలు కాపులుప్పాడ యార్డుకు తరలింపు, గాజువాక జోన్‌లో వివిధ వార్డుల నుంచి చెత్త సేకరించే ఆరు వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించే అంశాలపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను సభ్యులు కోరారు. దీనికి సంబంధిత అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. స్టాండింగ్‌ కమిటీ వంటి ముఖ్య సమావేశం జరిగితే అధికారులకు గైర్హాజరు కావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై విభాగాల అధిపతులు సమావేశానికి హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని మేయర్‌ను కోరారు. కారుణ్య నియామకాలకు సంబంధించిన రెండు అంశాలు, గాజువాక జోన్‌లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే వాహనాల డ్రైవర్లకు వేతనాలు చెల్లించే అంశంతోపాటు జోన్‌-7లో ఆక్రమణలు, అనధికార ఫ్లెక్సీలు తొలగించడానికి ఐదుగురు అన్‌స్కిల్డ్‌ లేబర్‌ను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నియమించే అంశాలను వాయిదా వేయాలని తీర్మానించారు. మిగిలిన అంశాలను ఆమోదిస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, మెకానికల్‌ ఈఈ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:35 AM