ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీశాం

ABN, Publish Date - Feb 13 , 2024 | 09:25 PM

క్రీడల్లో రాణించే సత్తా ఉన్న మట్టిలో మాణిక్యాలను ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ పోటీల ద్వారా వెలికితీశామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan) తెలిపారు. మంగళవారం ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ముగింపు వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.

విశాఖపట్నం: క్రీడల్లో రాణించే సత్తా ఉన్న మట్టిలో మాణిక్యాలను ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ పోటీల ద్వారా వెలికితీశామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan) తెలిపారు. మంగళవారం ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ముగింపు వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ పోటీలు విజయవంత మయ్యాయని... రికార్డు స్థాయిలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘ఆడుదాం - ఆంధ్రా’’లో ఎంపికైన 14 మంది క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ పోటీల్లో రూ.37 కోట్ల స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.

విజేతలకు రూ.12.21 కోట్ల విలువైన బహుమతులు అందించినట్లు చెప్పారు. ఈ పోటీలు ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో నిర్వహించినట్లు తెలిపారు. రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి నైపుణ్యం ఉన్న వారిని గుర్తించగలిగితే, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ నుంచి మంచి క్రీడాకారులను పంపగలమని అన్నారు. ఉత్తరాంధ్రలో కోడి రాంమూర్తి గడ్డమీద సగర్వంగా ముగింపు పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు రూ.37 కోట్ల కిట్లను గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న క్రీడాకారులకు ఇచ్చినట్లు వ్యాఖ్యానించారు. రూ.12.21 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ట్యాలెంట్‌ కలిగిన 14 మందిని ప్రముఖ క్రీడా సంస్థలు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఇకపై సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తామని.. ప్రతి ఏడాది ఇలాగే ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 09:25 PM

Advertising
Advertising