ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: విశాఖకు సీఎం జగన్ రాక..వామపక్షాల నేతల హౌస్ అరెస్ట్..

ABN, Publish Date - Feb 21 , 2024 | 08:54 AM

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖ పర్యటనకు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవం ముగింపు సందర్భంగా సీఎం రానున్నారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో వామపక్షాలు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మార్గ మధ్యలో బార్కేడ్లు ఏర్పాటు చేసి.. జనాల తరలింపుకు సన్న హాలు చేస్తున్నారు.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బుధవారం విశాఖ (Visakha) పర్యటనకు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవం (Sharada Peetham Anniversary) ముగింపు సందర్భంగా సీఎం రానున్నారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి ఆలయం (Rajashyamala Ammavari Temple)లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో వామపక్షాలు నేతలను (CPI, CPM Leaders) పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మార్గ మధ్యలో బార్కేడ్లు ఏర్పాటు చేసి.. జనాల తరలింపుకు సన్నహాలు చేస్తున్నారు.

కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన అంటే విశాఖలో అధికారులతో పాటు ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఆయన వచ్చిన ప్రతిసారీ జన సమీకరణ చేయాలని ఆదేశిస్తున్నారు. వాహనం అద్దాలు దించని చోట కూడా ప్రజలతో చేతులు ఊపించాలని శాసిస్తున్నారు. దాంతో జనాలను తరలించడానికి అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఈసారి పార్టీ నాయకులకు కాకుండా అధికారులకే అన్ని బాధ్యతలు అప్పగించారు. చినముషిడివాడలోని శారదాపీఠంలో రాజశ్యామల పూజలో పాల్గొనడానికి సీఎం బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. ఆయన విజయవాడ నుంచి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి ఉదయం 11.20 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా గోపాలపట్నం, వేపగుంట, పురుషోత్తపురం మీదుగా చినముషిడివాడలో గల పీఠానికి వెళతారు. అక్కడ గంట సేపు ఉండి పూజలు చేస్తారు. 12.40 గంటలకు తిరిగి బయలుదేరి 12.55 గంటలకు విమానాశ్రయం చేరుకొని విజయవాడకు వెళతారు. ఆయన పీఠంలో ఉండేది కేవలం గంట మాత్రమే. విమానాశ్రయం నుంచి 15 నిమిషాలు ప్రయాణిస్తే పీఠం వస్తుంది. అయితే ఈ మార్గంలో 24 పాయింట్లు గుర్తించి, అక్కడ జనాలను ఉంచాలని జీవీఎంసీ అధికారులకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒక్కో పాయింట్‌ వద్ద 500 మందికి తక్కువ లేకుండా చూడాలని సూచించారు.

డ్వాక్రా గ్రూపు మహిళలను తరలించే బాధ్యతలను రీసోర్స్‌ పర్సన్లకు, పెన్షనర్లను తీసుకువచ్చే బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. వీరిని సమన్వయం చేసుకొని కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత పీడీలు, ఏపీడీలకు కట్టబెట్టారు. జోనల్‌ కమిషనర్లు పైనుంచి అన్నీ చూసుకోవాలని సూచించారు. ప్రధాన మార్గం నుంచి ఎంత దూరంలో ప్రజలు నిల్చోబెట్టాలనే విషయం కూడా స్పష్టంగా ఆయా అధికారులకు సూచించారు. విమానాశ్రయంలో టోల్‌ప్లాజా మొదలుకొని విమాననగర్‌ బస్టాప్‌, ఈటర్స్‌ స్టాపు, దుర్గానగర్‌ బస్టాప్‌, బిగ్‌ న్యూ మొబైల్‌ షాపు, విజేత సూపర్‌ మార్కెట్‌, రిలయన్స్‌ డిజిటల్స్‌, లక్ష్మీ షాపింగ్‌మాల్‌, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌, సింహాచలం పెట్రోల్‌ బంకు, గోపాలపట్నంలో బెహరా ఆస్పత్రి, భారతి కల్యాణ మండపం, వేపగుంట జంక్షన్‌, జోన్‌-8 కార్యాలయం...ఇలా చినముషిడివాడ జంక్షన్‌ వరకు 24 పాయింట్లు గుర్తించారు. పాయింట్‌కు 500 మంది చొప్పున మొత్తం పది వేల మందికి తక్కువ లేకుండా జనాలను తేవాలని ఆదేశాలు అందాయి. ఏయే వార్డుల నుంచి జనాలను తీసుకురావాలో కూడా సూచించడం గమనార్హం. పశ్చిమ, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాలకు చెందినవారితో పాటు 90, 91, 92, 94, 95, 97 వార్డులకు చెందిన వారిని తీసుకురావాలని చెప్పారు. విమానాశ్రయం నుంచి ఎక్కడా ఆగకుండా కాన్వాయ్‌లో వెళ్లిపోయేటపుడు ఈ జంక్షన్ల వద్ద జనాలు ఎందుకో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఎన్నికల సీజన్‌ కాబట్టి కారు అద్దాలు దించి, చేతులు ఊపుతూ వెళతారని, అందుకే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Updated Date - Feb 21 , 2024 | 08:54 AM

Advertising
Advertising