ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: బెల్ట్ షాపుల వేలంపై దండోరా.. సోషల్ మీడియాలో వైరల్

ABN, Publish Date - Feb 21 , 2024 | 12:28 PM

Andhrapradesh: అనకాపల్లి జిల్లాలో ఇసుక, బెల్ట్ షాపుల నిర్వాహకులు బరితెగుంపులకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇసుక, అనధికార బెల్ట్ షాపుల వేలంపాటపై దండోరా వేయించారు. ఈ దండోరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనకాపల్లి, ఫిబ్రవరి 21: అనకాపల్లి జిల్లాలో ఇసుక, బెల్ట్ షాపుల నిర్వాహకులు బరితెగుంపులకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇసుక, అనధికార బెల్ట్ షాపుల వేలంపాటపై దండోరా వేయించారు. ఈ దండోరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆదివారం పంచాయితీ కార్యాలయంలో ఇసుక, బెల్ట్ షాపులపై వేలంపాట నిర్వహించారని పంచాయితీ సెక్రటరీ అంగీకరించారు. వేలంపాట జరిగినట్టు తమకు సమాచారం లేదని వెదురుపర్తి పంచాయితీ కార్యదర్శి ఆనంద్ చెప్పారు. ఆదివారం సెలవు దినం కావడంతో పంచాయితీ కార్యాలయం తాళాలు క్రిందస్థాయి సిబ్బందికి ఇచ్చామన్నారు. వేలంపాట జరిగే క్రమంలో ఘర్షణ చెలరేగడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిసిందన్నారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే వేలంపాట నిర్వహించినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నట్లు తెలిపారు. పంచాయితీ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని ఆనంద్ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 21 , 2024 | 12:28 PM

Advertising
Advertising