Devotees: కార్తీక మాసం రెండో సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Nov 11 , 2024 | 08:15 AM
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాలు శివ నామస్మరణలతో మారుమోగుతున్నాయి.
అమరావతి: కార్తీక మాసం (Kartika Maasam) రెండో సోమవారం (Second Monday) సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. విజయవాడ దుర్గా ఘాట్‌లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం నుంచి భవాని దీక్షలు ప్రారంభమవుతాయి. భవాని దీక్షల కోసం మల్లికార్జున మహా మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
విశాఖ...
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాలు శివ నామస్మరణలతో మారుమోగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా..
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా పాలకొల్లులోని క్షీరా రామ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. పాలకొల్లు పంచారామ క్షేత్రంలో వేకువజామునే మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు హర హర మహాదేవ అంటూ దీపోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నరసాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్థానాలు ఆచరించి.. కార్తీక దీపాలు విడిచి పెట్టి పూజలు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా.. అన్నవరం..
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తెల్లవారుజాము మూడు గంటల నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు భక్తులకు కల్పించారు. భక్తుల రద్దీతో టిక్కెట్ తీసుకున్నవారికి దర్శనం గంట సమయం.. సాదరణ దర్శనం రెండు గంటలు సమయం పడుతుంది. అలాగే ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి, మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, కుండళేశ్వరం శ్రీ పార్వతీ కుండళేశ్వర స్వామి ఆలయాలతో పాటు పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కాగా విజయవాడ... ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. మండల దీక్షలు స్వీకరించడానికి భవానీలు భారీగా తరలివచ్చారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం ఆరో అంతస్తులో భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 11 , 2024 | 08:15 AM