ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసుల విస్తృత తనిఖీలు

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:50 AM

జీకేవీధి మండలం సీలేరులో బుధవారం ఐటీఐ జంక్షన్‌ వద్ద ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చీపోయే వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయిని టూరిస్టుల ముసుగులో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన స్మగ్లర్ల ముఠాలు రవాణాకు పాల్పడుతున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సీలేరు ఎస్‌ఐ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టారు.

సీలేరు ఐటీఐ జంక్షన్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

- ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతోందని నిఘా వర్గాల హెచ్చరిక

- పర్యాటకుల ముసుగులో స్మగ్లర్లు రవాణా చేస్తున్నారని సమాచారం

- తెలంగాణ వైపు వెళ్లే వాహనాలను సోదా చేసిన పోలీసులు

సీలేరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరులో బుధవారం ఐటీఐ జంక్షన్‌ వద్ద ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చీపోయే వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయిని టూరిస్టుల ముసుగులో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన స్మగ్లర్ల ముఠాలు రవాణాకు పాల్పడుతున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సీలేరు ఎస్‌ఐ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఐటీఐ కూడలి వద్ద సీఆర్‌పీఎఫ్‌, సివిల్‌ పోలీసు బలగాలను మోహరించి ధారకొండ పరిసర ప్రాంతాల నుంచి, ఒడిశాలోని చిత్రకొండ, సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వెళ్లే వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. వాహనాల్లో వస్తున్న వారి గుర్తింపు కార్డులు పరిశీలించి, వారు ఎక్కడ నుంచి వస్తున్నారో ఆరా తీశారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 26 , 2024 | 12:50 AM