ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి ఉచిత గ్యాస్‌ బుకింగ్‌

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:59 AM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

free gas cylinder

31న సిలిండర్లు డెలివరీ

జిల్లాలో 5.29 లక్షల మంది బియ్యం కార్డుదారులకు లబ్ధి

ఏడాదికి రూ.128.7 కోట్లు

ఖర్చు చేయనున్న ప్రభుత్వం


విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సిలిండర్‌ బుక్‌ చేసుకునేందుకు మంగళవారం నుంచి అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మంగళవారం బుక్‌ చేసుకున్న వారికి ఈనెల 31వ తేదీ దీపావళి రోజున సిలిండర్లు డెలివరీ ఇస్తారు. డెలివరీ సమయం లేదా ముందుగా (ఆన్‌లైన్‌లో) గ్యాస్‌ ఏజెన్సీకి రూ.811 చెల్లించాలి. ఆ మొత్తాన్ని తరువాత ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. బియ్యం కార్డుదారులంతా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు.


ఈ సమయాల్లో..

ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఒకటి, ఆగస్టు నుంచి నవంబరు వరకూ మరొకటి, డిసెంబరు నుంచి మార్చి 31 వరకు ఇంకొకటి...ఇలా ఏడాదిలో మూడు సిలిండర్లు ఉచితంగా పొందవచ్చునని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. ఆధార్‌ కార్డు, ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరు ఉండాలి. కాగా విశాఖ జిల్లాలో 5.29 లక్షల మంది బియ్యం కార్డుదారులు ఉన్నారు. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.2,433 (విశాఖలో సిలిండరు ధర రూ.811) మేర లబ్ధి చేకూరనున్నది. ఈ లెక్కన ఏడాదికి జిల్లాలో గల 5.29 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ల పంపిణీ నిమిత్తం రూ.128.7 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. కాగా ఉచిత సిలిండర్‌ పొందే సమయంలో ఇబ్బందులుంటే సమీపంలో గ్యాస్‌ ఏజెన్సీకి లేదా పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు వెళ్లి అధికారులను సంప్రతించాలని జేసీ కోరారు. ప్రభుత్వం ఇచ్చే గ్యాస్‌ సిలిండర్లు దుర్వినియోగం చేయవద్దని కోరారు.

ఇది కూడా చదవండి:

Rohit Sharma: రోహిత్ శర్మ లైట్ తీసుకోడు: రవిశాస్త్రి

సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 29 , 2024 | 12:12 PM