ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Selfi video: నా ఆత్మహత్య వెనుక అసలు కారణాలు డిప్యూటీ సీఎంకు తెలియాలి..

ABN, Publish Date - Nov 04 , 2024 | 08:33 AM

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... తనలాంటి చిరు వ్యాపారస్తుల కష్టాలను తెలుసుకొని... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గణేష్ కోరాడు. సెల్ఫీ వీడియోలో కుమిలిపోతూ భార్య, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. తల్లి, అన్నదమ్ములకు క్షమాపణలు కోరాడు

విశాఖ: తన ఆత్మహత్య వెనుక అసలు కారణాలు ఏపీ డిప్యూటీ సీఎం (Deputy CM), జనసేన అధ్యక్షుడు (Janasena Chief) పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) తెలియాలంటూ గణేష్ (Ganesh) అనే వ్యక్తి తన బాధను తెలియజేస్తూ.. సెల్ఫీ వీడియో (Selfie Video) తీసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ‘‘పవన్ కళ్యాణ్ గారు.. మీరే మా ఇన్స్‌పిరేషన్.. మీరు రాజకీయాల్లో అనేక దెబ్బలు తిని... ఇప్పుడు సక్సెస్ అయ్యారు’’ అంటూ పేర్కొన్నాడు. తన చావుకు సోనోవిజన్ భాస్కర్ మూర్తి వేధింపులే కారణమని, భాస్కర్ మూర్తి దగ్గర ఉన్న బ్లాక్ మనీ కారణంగా తనలాంటి యువ వ్యాపారవేత్తలను ఎదగనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గణేష్ పేర్కొన్నాడు. బడా వ్యాపారస్తులకు... చిరు వ్యాపారస్తులకు సేల్స్ టాక్స్ ఒకటే స్లాబ్ వేస్తే... చిరు వ్యాపారస్తులు ఎలా తట్టుకుంటారని ప్రశ్నించాడు.


ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... తనలాంటి చిరు వ్యాపారస్తుల కష్టాలను తెలుసుకొని... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గణేష్ కోరాడు. సెల్ఫీ వీడియోలో కుమిలిపోతూ భార్య, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. తల్లి, అన్నదమ్ములకు క్షమాపణలు కోరాడు. వి కన్వెన్షన్ సెంటర్లో రోజుల క్రితం జరిగిన ఆత్మహత్య సెల్ఫీ సూసైడ్ వీడియో బయటికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు పీఎం పాలెంలో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి

84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 04 , 2024 | 08:33 AM