Ap News.. రైల్వే జోన్ కోసం భూమి ఇవ్వలేక పోయారు?: గంటా శ్రీనివాసరావు
ABN, Publish Date - Feb 02 , 2024 | 07:15 AM
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారని, సీఎం జగన్ సిగ్గు పడాలని అన్నారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘సిగ్గు పడాలి జగన్మోహన్ రెడ్డి గారు... కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారు..? రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో విశాఖలో భూదోపిడీకి పాల్పడి, లక్షల కోట్ల విలువైన వేల ఎకరాల భూములను మీరు మీ సామంత రాజులు దోచుకున్నారు... కానీ విశాఖ రైల్వే జోన్ కోసం మాత్రం 53 ఎకరాల స్థలం కూడా దొరకలేదా..? చరిత్రలో మీరు విశాఖ ద్రోహిగా మిగిలిపోయారు... విశాఖను వైకాపా విముక్త ప్రాంతంగా చేసుకునేందుకు ఇప్పటికే విశాఖ ప్రజలు సిద్ధమైపోయారు’’ అంటూ గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు.
ఈ వార్త కూడా చదవండి: విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా?
Updated Date - Feb 02 , 2024 | 07:18 AM