గర్భిణి మృతిపై విచారణ
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:47 AM
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో గర్భిణి మృతిపై డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ రమేశ్ కిషోర్ బుధవారం విచారణ చేపట్టారు. ఎస్.రాయవరం మండలం చినగుమ్మలూరుకి చెందిన కంటె దేవి పురుడు పోసుకోవడానికి సోమవారం మధ్యాహ్నం ప్రాంతీయ ఆస్పత్రిలో చేరి మంగళవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
- నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించిన డీఎస్‌హెచ్ జేసీ రమేశ్ కిషోర్
నర్సీపట్నం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో గర్భిణి మృతిపై డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ రమేశ్ కిషోర్ బుధవారం విచారణ చేపట్టారు. ఎస్.రాయవరం మండలం చినగుమ్మలూరుకి చెందిన కంటె దేవి పురుడు పోసుకోవడానికి సోమవారం మధ్యాహ్నం ప్రాంతీయ ఆస్పత్రిలో చేరి మంగళవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంఽధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ రమేశ్ కిషోర్ ప్రసూతి వార్డు, లేబర్ రూమ్‌ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. గైనికాలజిస్ట్‌ని, నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారించారు. కంటె దేవి ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి మంగళవారం ఉదయం వరకు జరిగిన వైద్యం గురించి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారదను ఆరా తీశారు.
గర్భిణి మృతి బాధాకరం
వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆదేశాలతో గర్భిణి మృతిపై విచారణ జరుపుతున్నామని జాయింట్ కమిషనర్ రమేశ్‌కిషోర్ తెలిపారు. గర్భిణి 23వ తేదీన ఏరియా ఆస్పత్రికి వచ్చిందని, కాళ్లు వాపులు గమనించి ఆస్పత్రిలో చేర్చుకొని, 25న ప్రసవం అవుతుందని డాక్టర్ చెప్పారని అన్నారు. 24వ తేదీ ఉదయం ఉమ్మనీరు పోవడంతో ఆకస్మికంగా శ్వాస ఆగిపోయిందని, వైద్య సిబ్బంది సీపీఆర్ చేశారని తెలిపారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌కి సమాచారం ఇచ్చారని అన్నారు. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. గర్భిణి మృతి బాధాకరమని అన్నారు. ఆయన వెంట డీసీహెచ్‌ఎస్ శ్రీనివాసరావు వున్నారు.
Updated Date - Dec 26 , 2024 | 12:47 AM