ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jr NTR-Devara: జూనియర్ ఎన్టీఆర్‌ను తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:26 PM

జూనియర్ ఎన్టీఆర్‌ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం తాకింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. దేవర సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ నినాదాలను జన జాగరణ సమితి నేతలు అతికించారు.

విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సినీ ప్రియులను అలరించేందుకు ‘దేవర’ సిద్ధమయ్యాడు. యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ్మ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్ నుంచి దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఉత్కంఠకు తెరదించుతూ మరికొన్ని గంటల్లోనే.. అంటే సెప్టెంబర్ 27న ఈ సినిమా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.


జూనియర్ ఎన్టీఆర్‌ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సెగ తాకింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది.

దేవర సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నేతలు అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విశాఖపట్నంలో చాలాచోట్ల దేవర సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదాలతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. మరి ఈ పోస్టర్ల వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది.


దేవరకు భారీ క్రేజ్

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ నుంచి వస్తున్న సినిమా దేవర. మరోవైపు జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌తో పాటు సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో నటించాడు. గతంలో ఎన్టీఆర్‌ నటించిన ఏ సినిమాకు రానంత క్రేజ్ ఈ సినిమాకు ఏర్పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చెప్పుకోదగ్గ అడ్వాన్స్ బుకింగ్స్ రాబడుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. హిందీ బెల్ట్ రాష్ట్ట్రాల్లో కూడా బుకింగ్స్ బాగుంటే ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇవి కూడా చదవండి

దుర్గమ్మ లడ్డూ ప్రసాదం తయారీలోనూ లోపాలు.. వెలుగులోకి నిజాలు

Updated Date - Sep 26 , 2024 | 01:55 PM