AP NEWS: సీఎం జగన్ దళిత ద్రోహి: కిరణ్ రాయల్
ABN, Publish Date - Feb 18 , 2024 | 10:34 PM
సీఎం జగన్ దళిత ద్రోహి అని.. ఆయనకు, వైసీపీ నేతలకు దళితుల మీద ప్రేమ కపట నాటకమని జనసేన నాయకులు కిరణ్ రాయల్ అన్నారు.
తిరుపతి: సీఎం జగన్ దళిత ద్రోహి అని.. ఆయనకు, వైసీపీ నేతలకు దళితుల మీద ప్రేమ కపట నాటకమని జనసేన నాయకులు కిరణ్ రాయల్ అన్నారు. ఆదివారం నాడు జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలకు అంబేద్కర్ పేరు తీసివేసి సీఎం జగన్ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటుని అన్నారు. అంబేద్కర్ భావజాలం చెప్పుకునే జూపూడి ప్రభాకర్ లాంటి దళిత నాయకులు.. అంబేద్కర్ను తొలగిస్తే ప్రశ్నించకపోవడం దళిత జాతికి అవమానమని చెప్పారు.
అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత జూపూడి ప్రభాకర్కి లేదన్నారు. జూపూడి మాటలను, అంబేద్కర్ వాదులు అందరూ ఖండిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద జనసేన తరపున నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. దళిత నేతలందరూ జూపూడి వ్యాఖ్యలను ఖండించాలని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో రైతాంగం సర్వనాశనమైందని విరుచుకుపడ్డారు. రైతు సంఘాలంతా సీఎం తీరును ఖండించాలని కిరణ్ రాయల్ అన్నారు.
Updated Date - Feb 18 , 2024 | 10:34 PM