Visakha: మంత్రి గారి తాలూకా అంటూ మందుబాబుల హల్‌చల్
ABN, Publish Date - Jul 17 , 2024 | 01:46 PM
విశాఖ: నగరంలో మందుబాబులు బరితెగిస్తున్నారు. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి తాజాగా మరో సంఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించిన మందుబాబులు మంత్రిగారి తాలూకా అంటూ హల్ చల్ చేశారు.
విశాఖ: నగరంలో మందుబాబులు (Mandhubabula) బరితెగిస్తున్నారు. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి తాజాగా మరో సంఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసు (Traffic Police)లపై వీరంగం సృష్టించిన మందుబాబులు మంత్రిగారి తాలూకా అంటూ హల్ చల్ (Hal Chal) చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేరుతో బెదిరించారు. మద్యం సేవించి (Drink alcohol) కారు (Car) నడిపిన వ్యక్తులపై పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసు (Drunk Drive Case) నమోదు చేశారు. దీంతో మందుబాబులు ఊగిపోయారు. ఎస్ఐ (SI), సీఐ (CI), సీపీ (CP)లను విఆర్ (VR)కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
అలాగే మాకవరపాలెం మండలంలో గిడుతూరులో ఓ మాజీ వలంటీర్ మంగళవారం వీరంగం సృష్టించాడు. 108 సిబ్బందితో కలిసి సచివాలయ సిబ్బంది వైద్య శిబిరం నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చి మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. టేబుళ్లను తిరగేసి మందులను చెల్లాచెదురు చేశాడు. దీనిపై పోలీసులకు సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
గిడుతూరులోని రామాలయం వద్ద ఉన్న భవనంలో 108 సిబ్బంది ప్రతి మంగళవారం వైద్య శిబిరం నిర్వహిస్తుంటారు. సచివాలయ సిబ్బంది అక్కడ సేవలు అందిస్తుంటారు. ఇదే క్రమంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ సమయంలో మూకల రమణబాబు అనే మాజీ వలంటీర్ అక్కడికి వచ్చాడు. ఇతను ఎన్నికల ముందు వలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కాగా మద్యం మత్తులో వైద్య శిబిరానికి రావడంతో అక్కడ ఉన్న రోగులు ముక్కు మూసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన మాజీ వలంటీర్ అక్కడ ఉన్న కుర్చీలు, టేబుళ్లను విసిరికొట్టాడు. దీని వల్ల అక్కడే ఉన్న ఆశ కార్యకర్త పాసపు రామరత్నానికి గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా అతను రోగులకు ఇవ్వాల్సిన మందులను చెల్లాచెదురు చేశాడు. వైద్య పరికరాలను పగులగొట్టాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఏఎన్‌ఎం సాయిరెడ్డి నాగలక్ష్మి, ఆశ కార్యకర్త పాసపు రామరత్నం ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు..
అధికారిక నివాసంలో పూజలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు..
రుణమాఫీ రూపొందించిన విధానం సరిగాలేదు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 17 , 2024 | 01:48 PM