ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీలో భారీగా చేరికలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:15 PM

మండలంలోని భీంపోలు సర్పంచ్‌ జన్ని భీమలమ్మతో పాటు వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, తదితరులు అధిక సంఖ్యలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర సమక్షంలో సోమవారం టీడీపీలో చేరారు.

దొన్నుదొర సమక్షంలో టీడీపీలో చేరిన భీంపోలు సర్పంచ్‌, వార్డు సభ్యులు, తదితరులు

దొన్నుదొర సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న భీంపోలు సర్పంచ్‌, వార్డు సభ్యులు

చంద్రబాబు పాలన నచ్చి వైసీపీని వీడినట్టు వెల్లడి

అరకులోయ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని భీంపోలు సర్పంచ్‌ జన్ని భీమలమ్మతో పాటు వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, తదితరులు అధిక సంఖ్యలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర సమక్షంలో సోమవారం టీడీపీలో చేరారు. అరకులోయలోని తన నివాసంలో వారికి దొన్నుదొర టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భీంపోలు సర్పంచ్‌ జన్ని భీమలమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థవంతమైన పాలన నచ్చి వైసీపీని వీడి టీడీపీలో చేరినట్టు తెలిపారు. అనంతరం దొన్నుదొర మాట్లాడుతూ భీంపోలు సర్పంచ్‌, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఈశ్వరరావు, సారా సద్దు, నీటి వినియోగదారుల సంఘం చైర్మన్‌ శెట్టి వెంకటరమణ, వార్డు సభ్యులు మోతుబోయిన కుమారి, పి.పోతమ్మ, కందుల బంగారమ్మ, జన్ని లక్ష్మణరావు, సీనియర్‌ నాయకులు ఎం.సన్యాసి, ఎం.పెంటయ్య, జి.పోతయ్య, ఎస్‌.సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:15 PM