ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

4న నౌకాదళ విన్యాసాలు

ABN, Publish Date - Dec 20 , 2024 | 01:16 AM

నగరంలో వచ్చే నెల నాలుగో తేదీన ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళం విన్యాసాలు ప్రదర్శించనున్నదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తెలిపారు.

ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

2న పూర్తిస్థాయి రిహార్సల్స్‌: తూర్పు నౌకాదళ అధికారి

విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

నగరంలో వచ్చే నెల నాలుగో తేదీన ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళం విన్యాసాలు ప్రదర్శించనున్నదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఏటా డిసెంబరు నాలుగో తేదీన విశాఖలో నేవీడే నిర్వహిస్తుంటారని, అయితే ఈ పర్యాయం ఆ కార్యక్రమం పూరీలో జరిగిందన్నారు. దానికి అనుబంధంగా జనవరి నాలుగో తేదీన విశాఖలో విన్యాసాలు ప్రదర్శించబోతున్నారన్నారు. ఈ కార్యక్రమం కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధాన వేదిక సమీపంలో సీఎం కోసం గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటుచేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. తూర్పు నౌకాదళానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ నాలుగో తేదీ సాయంత్రం బీచ్‌లో ఓపీ డెమో జరుగుతుందని, లేజర్‌షో, డ్రోన్‌షో, నౌకల పైనుంచి విన్యాసాలు ఉంటాయన్నారు. జనవరి రెండో తేదీన పూర్తిస్థాయి రిహార్సల్స్‌ జరుగుతాయన్నారు. నేవీ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరించాలని కోరారు. సమీక్షలో జీవీఎంసీ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌, వీఆఎంఆర్డీఏ కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌, డీసీపీ అజిత వేజెండ్ల, నేవీ అధికారులు వైకే కిషోర్‌కుమార్‌, సంజీవ్‌శరణ్‌, ఉజైర్‌ కుస్రో, డీఆర్వో బీహెచ్‌ భవానీశంకర్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 01:16 AM