ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నిర్లక్ష్యం.. పేదలకు శాపం!

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:32 AM

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సొంత గూడు లేని నిరుపేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు నిరుపయోగంగా పడివున్నాయి. ఆరేళ్ల క్రితం నిర్మాణ పనులు చేపట్టగా, గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో గృహ సముదాయాలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. గత టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ జెండా రంగులు వేసుకోవడానికి చూపిన శ్రద్ధ, మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం చూపలేదు.

నర్సీపట్నంలోని బలిఘట్టంలో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయని టిడ్కో కాలనీ

సొంతగూటికి నోచుకోని టిడ్కో లబ్ధిదారులు

గత టీడీపీ హయాంలో పట్టణ పేదలకు గృహసముదాయాల నిర్మాణం

పనులు చివరిదశలో ఉండగా మారిన ప్రభుత్వం

నాలుగేళ్ల వరకు పట్టించుకోని వైసీపీ పాలకులు

భవనాలకు సొంత పార్టీ రంగులు

గత ఏడాది అరకొరగా పనులు

ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ

మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు

పలు కాలనీల్లో ఒక్కరు కూడా నివాసం ఉందని వైనం

అనకాపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సొంత గూడు లేని నిరుపేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు నిరుపయోగంగా పడివున్నాయి. ఆరేళ్ల క్రితం నిర్మాణ పనులు చేపట్టగా, గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో గృహ సముదాయాలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. గత టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ జెండా రంగులు వేసుకోవడానికి చూపిన శ్రద్ధ, మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం చూపలేదు. ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో గత ఏడాది చివరలో కొన్ని కాలనీల్లో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను పంపిణీ చేసింది. పూర్తిస్థాయిలో వసతులు కల్పించకపోవడంతో అరకొరగా లబ్ధిదారులు నివాసం వుంటున్నారు. మిగిలిన కాలనీల్లో ఒక్క మౌలిక సదుపాయం కూడా కల్పించలేదు. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఇంకెంతకాలం వేచిచూడాలోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో టిడ్కో ఇళ్ల స్థితిగతులపై ‘ఆంధ్రజ్యోతి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇళ్లను నిర్మించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిడ్కో)ను ఏర్పాటుచేసింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు నోడల్‌ సంస్థగా ‘టిడ్కో’ కార్యకలాపాలు సాగిస్తుంది. టీడీపీ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాగా వున్నప్పుడు (ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరిధిలో) సుమారు ఏడు వేల మంది లబ్ధిదారులకు అనకాపల్లి మండలం సత్యనారాయణపురం, కొండకొప్పాక, సిరసపల్లితోపాటు ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలు, పరవాడలో టిడ్కో గృహసముదాయాల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు శరవేగంగా జరిగిన పనులు.... తరువాత ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా ఆగిపోయాయి. అప్పటికే పనులన్నీ పూర్తయి, నివాసానికి అనువుగా వున్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా వృథాగా వుంచేసింది. లబ్ధిదారులు ఆందోళనలు చేయడంతో ఎట్టకేలకు రెండేళ్ల తరువాత స్పందించి టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల పునఃప్రారంభానికి చర్యలు చేపట్టింది. అయినా సరే వైసీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి పూర్తిచేయలేదు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు.

అనకాపల్లి మండలం సత్యనారాయణపురం టిడ్కో గృహసముదాయంలోకి పూర్తిస్థాయిలో లబ్ధిదారులు రాకముందే నిర్మాణంలో నాణ్యతాలోపలు బయటపడుతున్నాయి. వర్షం కురిస్తే శ్లాబ్‌, గోడలు లీకేజీ అవుతున్నాయి. ప్లంబింగ్‌ పనులు నాసిరకంగా వుండడంతో పైపులు కారిపోతున్నాయి. తాగునీటి సదుపాయం, వీధి దీపాలు, డ్రైనేజీలు లేవు. చీకటిపడితే అంధకారం నెలకొంటున్నది. కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో తుప్పలు పెరిగిపోయాయి. ఇక్కడ మొత్తం 2,764 ఫ్లాట్లకుగాను సుమారు 500 కుటుంబాలు మాత్రమే నివాసం వుంటున్నాయి.

కొండకొప్పాక, సిరసపల్లిలో 936 ఫ్లాట్లతో గృహ సముదాయాల నిర్మాణం గత టీడీపీ హయాంలో చేపట్టారు. 2019 ఎన్నికల నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. 800 మంది లబ్ధిదారులు వాటా సొమ్ము చెల్లించడంతో గృహనిర్మాణ శాఖ అధికారులు లాటరీ పద్ధతిలో డ్రా తీసి ఫ్లాట్లు కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మిగిలిన పనులు పూర్తిచేయలేదు.

ఎలమంచిలి పట్టణంలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గృహసముదాయంలో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించకుండానే గత వైసీపీ ప్రభుత్వం హడావిడిగా లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేసింది. భవన నిర్మాణం, ప్లంబింగ్‌ పనులు నాసిరకంగా వుండడంతో లీకేజీలు అధికమయ్యాయి. మెయిన్‌ రోడ్డు నుంచి కాలనీలోకి సిమెంట్‌ రోడ్డు నిర్మించలేదు. మట్టి రోడ్డులో నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. రక్షిత తాగునీటి సదుపాయం లేదు. వాడుక నీటి కోసం ఎనిమిది బోర్లు వేసి నాలుగు మోటార్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిల్లో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. బోర్లు నీరు తాగడానికి పనికిరాదు. సమీపంలో వున్న మరో కాలనీకి వెళ్లి కొళాయిల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో 432 మందికిగాను ప్రస్తుతం 250 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు.

నర్సీపట్నం మునిసిపాలిటీలో టిడ్కో ఇళ్లు ఒక్కటి కూడా లబ్ధిదారులకు అందుబాటులోకి రాలేదు. కసిమి రోడ్డులోని గృహసముదాయంలో మూడు బ్లాకులకు సంబంధించి 144 ఫ్లాట్ల పనులు ఇంకా పూర్తికాలేదు. బలిఘట్టం గృహసముదాయంలో వాటర్‌ ట్యాంకులు, సెప్టిక్‌ ట్యాంకులు, రోడ్లు, డ్రైనేజీ కాలువలు, విద్యుత్‌ పనులు పూర్తి కాలేదు. ప్రధాన రహదారి నుంచి గృహ సముదాయానికి రోడ్డు నిర్మించలేదు. కసిమి రోడ్డులోని గృహసముదాయానికి ప్రధాన రహదారిని కలుపుతూ అప్రోచ్‌ రోడ్డు నిర్మించాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్‌, సెప్టిక్‌ ట్యాంకులు, వాటర్‌ ట్యాంక్‌లు నిర్మించలేదు. ఈ రెండు గృహసముదాయాలకు వరహా నది నుంచి తాగునీటి సరఫరాకు పైప్‌లైన్‌ వేయాల్సి వుంది.

పరవాడ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని టిడ్కో కాలనీలో 512 మందికి గత టీడీపీ హయాంలోనే ఇళ్లు కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి 60 శాతం పనులు పూర్తయ్యాయి. తరువాత చాలా నెలలపాటు పనులు చేయలేదు. ఎట్టకేలకు ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి గత ఏడాది డిసెంబరులో లబ్ధిదారులకు అప్పగించారు. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో కొద్ది మంది మాత్రమే నివాసరం వుంటున్నారు. పరవాడ మండలం మంత్రిపాలెం వద్ద టిడ్కో గృహసముదాయం పరిస్థితి ఇంతకన్నా దారుణంగా వుంది. ఇళ్లకు విద్యుత్‌ వైరింగ్‌, తాగునీరు, సెప్టిక్‌ ట్యాంకు పనులు పూర్తికాలేదు. డ్రైనేజీ కాలువలు అరకొరగా నిర్మించారు.. ప్రస్తుతం ఇక్కడ ఒక్కరు కూడా నివాసం వుండడంలేదు.

Updated Date - Dec 25 , 2024 | 11:42 AM