ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అడ్డంకులు తొలగుతున్నాయ్‌

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:34 AM

వైసీపీ పరిపాలనలో ఆ పార్టీ నాయకులు వారి స్వప్రయోజనాల కోసం ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టించారు.

మరో రహదారికి మోక్షం

ఆరు నెలల క్రితం సిరిపురం టైకూన్‌ సెంటర్‌లో రోడ్డు బ్లాక్స్‌ తొలగింపు

నేడు రుషికొండ బీచ్‌ దక్షిణ మార్గంలో స్టాపర్ల ఎత్తివేత

సందర్శకుల రాకపోకలు అవకాశం

విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ పరిపాలనలో ఆ పార్టీ నాయకులు వారి స్వప్రయోజనాల కోసం ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టించారు. అవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ ఆరు నెలల కాలంలో విశాఖ ప్రజలకు రెండు ప్రయోజనాలు చేకూరాయి. సిరిపురం టైకూన్‌ జంక్షన్‌లో డివైడర్ల తొలగింపు మొదటిది. వీఐపీ రోడ్డు నుంచి ఆశీల్‌మెట్ట వైపు, సిరిపురం నుంచి వీఐపీ రోడ్డులోకి వాహనాలు వెళ్లకుండా అప్పట్లో జంక్షన్‌ బ్లాక్‌ చేయించారు. నగరవాసులు ఎంత కోరినా వాటిని తొలగించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే నాయకులంతా వెళ్లి ఆ బ్లాక్స్‌ను తొలగించారు. నాటి నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.

ఇక రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్‌ నిర్మించుకున్న నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆ పరిసర ప్రాంతాల వైపు ఎవరూ రాకుండా కట్టడి చేశారు. రుషికొండ బీచ్‌లోకి గతంలో రెండు మార్గాలు ఉండేవి. కొండకు ఉత్తరం వైపు ఒకటి, దక్షిణం వైపు మరొకటి ఉండేవి. ప్యాలెస్‌ నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ కార్మికుల కోసం క్యాంపు పెట్టారు. దాంతో దక్షిణ మార్గం మూసేశారు. అక్కడి నుంచే ప్యాలెస్‌లోకి మరో ప్రధానమార్గం ఏర్పాటు చేయడంతో నిర్మాణం పూర్తయినా సరే సెక్యూరిటీ పేరుతో ఆ మార్గాన్ని ఓపెన్‌ చేయలేదు. దాంతో బీచ్‌లోకి ఒక్కటే మార్గం కావడంతో వారాంతపు రోజుల్లో రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను మీడియా ఎత్తిచూపడంతో కూటమి నేతలు స్పందించారు. పర్యాటక శాఖ అధికారులతో సంప్రతించి దక్షిణ మార్గం ప్రారంభించాలని సూచించారు. ఆ పనులన్నీ పూర్తి కావడంతో విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, జాయింట్‌ కలెక్టర్‌ మయూర అశోక్‌ అంతా కలిసి సోమవారం మద్యాహ్నం దానిని పునఃప్రారంభించారు. ఈ మార్గంలో బీచ్‌ వ్యూ బాగుంటుందని అంత సంతోషం వ్యక్తంచేశారు.

నియోజకవర్గ ఎమ్మెల్యే లేకుండానే...

రుషికొండ భీమిలి నియోజకవర్గంలో ఉంది. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేకుండా, ఆయన నగరంలో లేనప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ విషయమై అధికారులపై మండిపడినట్టు తెలిసింది. వివాదాలకు తావివ్వకుండా అంతా అందుబాటులో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండేదని అధికారులకు చెప్పినట్టు సమాచారం.

Updated Date - Dec 24 , 2024 | 01:34 AM