పవన్‌ను పక్కదారి పట్టించిన అధికారులు
ABN, Publish Date - Dec 22 , 2024 | 01:06 AM
మండలంలోని హట్టగుడ నుంచి రణజిల్లెడ జలపాతం రోడ్డు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను జిల్లా పంచాయతీరాజ్ అధికారులు తప్పుదోవ పట్టించారు. వాస్తవ పరిస్థితులను పాలకులు, సంబంధిత శాఖ ఉన్నత స్థాయి అధికారుల దృష్టిలో పెట్టకుండా జిల్లా అధికారులు వ్యవహరించారు. టూరిజం స్పాట్స్‌కు రహదారి సౌకర్యం కల్పించడంలో భాగంగా ఉపాధి హామీ పథంకలో హట్టగుడ నుంచి రణజిల్లెడ జలపాతం వరకు తారు రోడ్డుకు పంచాయతీరాజ్ అధికారులు రూ.5.52 కోట్లు మంజూరు చేశారు. ఈ ఏడాది మార్చిలో ఈ రోడ్డు పనులు ప్రారంభించారు.
పీఆర్ ఇంజనీరింగ్ అధికారుల అత్యుత్సాహం
హట్టగుడ-రణజిల్లెడ రోడ్డు పనులు
పూర్తి చేయకుండా ప్రారంభం
పూర్తికాని రెండు సీసీ ర్యాంపులు
బురదగా మారడంతో రాకపోకలకు
ఇబ్బంది పడుతున్న గిరిజనులు
అరకులోయ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని హట్టగుడ నుంచి రణజిల్లెడ జలపాతం రోడ్డు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను జిల్లా పంచాయతీరాజ్ అధికారులు తప్పుదోవ పట్టించారు. వాస్తవ పరిస్థితులను పాలకులు, సంబంధిత శాఖ ఉన్నత స్థాయి అధికారుల దృష్టిలో పెట్టకుండా జిల్లా అధికారులు వ్యవహరించారు. టూరిజం స్పాట్స్‌కు రహదారి సౌకర్యం కల్పించడంలో భాగంగా ఉపాధి హామీ పథంకలో హట్టగుడ నుంచి రణజిల్లెడ జలపాతం వరకు తారు రోడ్డుకు పంచాయతీరాజ్ అధికారులు రూ.5.52 కోట్లు మంజూరు చేశారు. ఈ ఏడాది మార్చిలో ఈ రోడ్డు పనులు ప్రారంభించారు. తొమ్మిది నెలలు అవుతున్నా నేటి వరకు రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండు చోట్ల సీసీ ర్యాంపులు వేయాల్సి ఉంది. ఇంకా పనులు పూర్తి చేయకుండానే పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో ప్రారంభించడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హట్టగుడ నుంచి మాలసింగారం జంక్షన్ వరకు 2.75 కిలోమీటర్ల పరిధిలో రెండు చోట్ల సీసీ ర్యాంప్‌ల పనులే చేపట్టకుండా మట్టిపోసి వదిలేశారు. సీసీ ర్యాంప్‌లు నిర్మించాల్సిన ప్రాంతంలో మట్టి వేయడంతో వర్షాలకు బురదగా మారడంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వెంటనే రెండు సీసీ ర్యాంపులు, ఇతర పనులను పూర్తి చేయించాలని హట్టగుడ, మొంజగుడ గ్రామాల గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Dec 22 , 2024 | 01:06 AM