ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anakapalle: పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి

ABN, Publish Date - Nov 28 , 2024 | 10:51 AM

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్పిలో చికిత్స పొందుతో గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది పూర్తి నివేదికతో ప్రభుత్వం దృష్టి సారించింది.

అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మాసిటీ (Paravada Pharmacity) ఠాగూర్ ఫార్మా కంపెనీలో (Tagore Pharma Company) విషవాయులు (Toxic gases) లీకైన ఘటనలో మరో కార్మికుడు మృతి (Worker dies) చెందాడు. బుధవారం ఒడిషాకు చెందిన కార్మికుడు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పిఠాపురానికి చెందిన మరో కార్మికుడు గురువారం ఉదయం చనిపోయాడు. మొత్తం 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. మిగిలిన ఏడుగురు చికిత్స పొందుతున్నారు.

బుధవారం అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్పిలో చికిత్స పొందుతో గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది పూర్తి నివేదికతో ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. యాజమాన్య నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు నిన్ననే ఆరా తీశారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలావుందని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. ఈ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.


చంద్రబాబు ఆర

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని... వారిని క్రిటికల్ కేర్‌ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

మెరుగైన వైద్యం అందించాలి..

అస్వస్థతకు గురైన వారిలో మరో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని చంద్రబాబు అధికారులుకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.


పరవాడ ప్రమాదంపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం

పరవాడ ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చినా.. కంపెనీల నిర్లక్ష్య వైఖరిపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి హోంమంత్రి అనిత వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైనవారితో పాటు యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై.. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

ఫార్మా కంపెనీలో ప్రమాదం బాధాకరం: మంత్రి కొల్లు రవీంద్ర

ఫార్మా కంపెనీలో ప్రమాదం బాధాకరమని అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఠాగూర్ లేబరోటరీ యూనిట్ -3లో విష వాయువు లీకై కార్మికుడి మృతి అత్యంత బాధాకరమని అన్నారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఈ ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు..

యాజమాన్యాలు నిర్లక్ష్యం..

కాగా.. జిల్లాలోని పలు ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు కొరవడ్డాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగుల భద్రతపై కంపెనీల యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడంతో ప్రాణ నష్టం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగం విచారణ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ తరువాత కమిటీ బృందం ఇచ్చే నివేదిక వెలుగుచూడకపోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.

పరవాడలో 150కు పైగా ఫార్మా కంపెనీలు ..

కాగా.. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌, పరవాడ మండలంలోని సెజ్‌లో 150కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీల్లో వివిధ రాష్ట్రాల ఉద్యోగులు, కార్మికులు వేలాది మంది పని చేస్తున్నారు. అయితే పలు కంపెనీలు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడుతున్నారు. కొన్ని ఫార్మా కంపెనీల్లో రసాయనాలు లీక్‌ అవడం, గ్యాస్‌ రిఫైనరీల నుంచి మంటలు ఎగిసి పడడం, రసాయనాలు నిల్వ చేసే ట్యాంకర్లు, రియాక్టర్లు పేలిపోవడం వంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.

ప్రమాదకరమైన కెమికల్స్‌ వినియోగం..

ఆ సమయంలో కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు అనేక మంది ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొందరు క్షతగాత్రులవుతున్నారు. చాలా కంపెనీల్లో ప్రమాదకరమైన కెమికల్స్‌ వినియోగిస్తుంటారు. అటువంటి కెమికల్స్‌ నిర్వహణ బాధ్యతలను తక్కువ ఖర్చుతో చేపట్టేందుకు పలు కంపెనీల యాజమాన్యాలు సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. సబ్‌ కాంట్రాక్టర్లు కెమికల్స్‌ నిర్వహణ విషయంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోకపోవడం వల్ల తరచూ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. నైపుణ్యం లేని ఉద్యోగుల నియామకాలు, రక్షణ చర్యల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే యాజమాన్యాలు ఆ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో కార్మికులు, ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.

ఆగని ప్రమాదాలు

అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో ఫార్మా కంపెనీల్లో గత పదేళ్ల కాలంలో చిన్నా, పెద్ద కలిపి 50కు పైగా ప్రమాదాలు జరిగాయి. ఇప్పటి వరకు 40 మందికి పైగా వేర్వేరు ప్రమాదాల్లో కార్మికులు, ఉద్యోగులు మృతి చెందారు. 120 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. పరవాడ మండలంలో రెండేళ్ల కిందట ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు క్షతగాత్రులయ్యారు. ఏడాది కిందట అచ్యుతాపురం ఈఎస్‌ఈజెడ్‌లో జీఎంఎఫ్‌సీ ల్యాబ్స్‌లో రియాక్టరు పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయాల పాలయ్యారు. పరవాడ ఫార్మాసిటీలో సాయినాథ్‌ కెమికల్స్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు, స్మైలెక్స్‌ కంపెనీలో సంభవించిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అప్పట్లో మృతి చెందిన సంగతి తెలిసిందే.

పలువురికి అస్వస్థత..

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో సీడ్స్‌ విభాగంలో 2022 జూన్‌ 3న, ఆగస్టు 2న విషవాయువు లీకై అనేకమంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. గత ఏడాది జూన్‌ నెలలో రాంబిల్లి మండలంలో సాహితీ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. నలుగురు గాయాలపాలయ్యారు. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌, పరవాడ, రాంబిల్లి మండలాల్లో పలు ఫార్మా కంపెనీల్లో తరచూ జరుగుతున్న ప్రమాద ఘటనలు మరువక ముందే అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రాంబిల్లి మండల పరిధిలో ఉన్న వసంత్‌ కెమికల్స్‌ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఒడిశాకు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. కంపెనీలో రియాక్టరు వద్ద సేఫ్టీ రివ్యూ వాల్వ్‌ లీకు కారణంగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు, ఉద్యోగులు భయాందోళనతో పరుగులు తీశారు.

మొక్కుబడి తనిఖీలు

ఫార్మా కంపెనీల్లో ఉద్యోగుల భద్రత, ప్రమాదాల నివారణకు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారనే దానిపై విచారణ జరపాల్సిన అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్లు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, కార్మిక, అగ్నిమాపక శాఖల అధికారులు ఏడాదిలో కనీసం నాలుగు పర్యాయాలు తనిఖీలు చేసి పరిస్థితులను చక్కదిద్దే దిశగా కంపెనీల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉన్నా ఆ విధంగా జరగడం లేదు. ఫార్మా కంపెనీల్లో కంట్రోల్‌ కాని రియాక్టర్లు ఉంటాయి. వాటిలో నిరంతరాయంగా హై టెంపరేచర్‌ ద్రవాలను మరిగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిపుణులైన ఉద్యోగులు, కార్మికులు ఆయా రియాక్టర్లు పనిచేసే విభాగాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా రియాక్టర్లు పేలిపోకుండా, ఇతరత్రా అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఫార్మా కంపెనీల్లో నిపుణులైన ఉద్యోగులు లేకపోవడం వల్లే తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కనీస చర్యలేవీ..

ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు పేలడం, పైపులైన్‌ లీకేజీల కారణంగా తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యర్థ రసాయనాలు ప్రవహించే పైపులైన్‌లు సక్రమంగా ఉన్నాయా?, లేదా? అనేది తరచూ పర్యవేక్షించాలి. వ్యర్థ రసాయనాలు శుద్ధి చేసిన తర్వాతే బయటకు పంపాల్సి ఉన్నా ఆ విధమైన చర్యలు చేపట్టక పోవడం వల్ల ప్రమాదాలు జరగుతున్నాయని తెలుస్తోంది. అచ్యుతాపురం, పరవాడ సెజ్‌లలో అత్యధిక శాతం మంది నిపుణులైన ఉద్యోగులు లేని కారణంగా తరచూ జరుగుతున్నా ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ

దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...

జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 28 , 2024 | 10:51 AM