ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan kalyan: అనకాపల్లి జిల్లాలో నేడు పవన్‌ వారాహి విజయభేరి యాత్ర

ABN, Publish Date - Apr 07 , 2024 | 07:15 AM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఆదివారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్‌ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

అనకాపల్లి జిల్లా: జనసేన పార్టీ అధ్యక్షుడు (Janasena Chief) పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి విజయభేరి యాత్ర (Varahi Vijayabheri Yatra)లో భాగంగా ఆదివారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్‌ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రింగ్‌రోడ్డులో గల ఎన్టీఆర్‌ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్‌, వేల్పుల వీధి మీదుగా నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వరకూ వారాహి వాహనంలో రోడ్డుషో నిర్వహిస్తారు. నాలుగు గంటలకు నెహ్రూచౌక్‌ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

సోమవారం ఎలమంచిలిలో పవన్‌ వారాహి విజయభేరి యాత్ర నిర్వహిస్తారు. అనకాపల్లి, ఎలమంచిలి సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఎల్లుండి (మంగళవారం) పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొననున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 07:17 AM

Advertising
Advertising