Visakha: హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..
ABN, Publish Date - Nov 24 , 2024 | 08:50 AM
ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జీలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
విశాఖ: నగరంలో పోలీసులు (Police) హోటల్స్ (Hotels), లాడ్జీలు (Lodges), మెన్ హాస్టళ్ల (Mens hostels)పై పోలీసులు తనిఖీలు (Police checks) చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటళ్లు, లాడ్జీలను గుర్తించారు. విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జిలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 47 హోటల్స్, లాడ్జీలలో అగ్నిమాపక ఎన్‌వోసీ (Noc)లు లేవు.. 22 హోటల్స్, లాడ్జీలలో జీఎస్టీ పత్రాలు లేవని, 8 హోటల్స్, లాడ్జీలలో ట్రేడ్ లైసెన్సులు లేనట్లు పోలీసులు గుర్తించారు. అలాగే 11 హోటల్స్, లాడ్జిలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సర్టిఫికెట్స్ లేవని... 5 హోటల్స్‌లో సందర్శికులకు సంబంధించి రికార్డులు మెంటైన్ చేయడం లేదని పోలీసులు పేర్కొన్నారు. మరో 36 హోటల్స్, లాడ్జీలలో లగేజ్ స్కానర్, అండర్ వెహికల్ చెక్ మిర్రర్ వంటి యాక్సెస్ లేదని, 5 హోటళ్లలో సీసీటీవీలను పర్యవేక్షించడం లేదన్నారు. హోటల్స్, లాడ్జీలలో నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ నగర సీపీ హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణ, హైదరాబాద్ నగరంలో దాదాపుగా ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితమే. దీంతో చాలా మందికి ఇంట్లో వండుకు తినే తిరికా.. సమయం ఉండడం లేదు. ఆ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లకు జనం భారీగా క్యూ కడుతున్నారు. ఇక వారాంతంలో.. అంటే శనివారం, ఆదివారం అయితే నగరంలోని దాదాపు అన్ని రెస్టారెంట్లు కస్టమర్లలతో కిటకిటలాడి పోతుంటాయి. దీంతో వారిని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రెస్టారెంట్లలో భారీగా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఆయా పదార్ధాలు మిగిలిపోతుంటాయి. వాటిని నిల్వ ఉంచి.. మరునాడు కస్టమర్లకు హోటల్, రెస్టారెంట్ల సిబ్బంది వినియోగిస్తున్నారు. వాటిని తిన్న వినియోగదారులు.. తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ముమ్మర తనిఖులు నిర్వహిస్తున్నారు.
అందులోభాగంగా నాగోల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. స్థానిక సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరసా రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని వారు గుర్తించారు. అలాగే నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గమనించారు. అదే విధంగా కాలం చెల్లిన బ్రెడ్, మిల్క్ ప్యాకెట్లు, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాస్‌లను సైతం ఆహార పదార్ధాల తయారీలో వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు వంట గది అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా.. బొద్దింకలు సైతం తిరుగుతున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం
జగన్‌ను బయట ఉంచి తప్పు చేస్తున్నారు..
చంద్రబాబు చేతికి జగన్ జుత్తు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 24 , 2024 | 08:50 AM