ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నర్సీపట్నం ఆస్పత్రిలో గర్భిణి మృతి

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:22 AM

ప్రసవం కోసం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో చేరిన గర్భిణి మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, గైనికాలజిస్టుతో వాగ్వాదానికి దిగారు. ఉదయం వరకు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆకస్మికంగా గుండె ఆగిపోయి మృతిచెందిందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

ప్రసూతి వార్డులో దేవి మృతదేహం

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపణ

ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, గైనికాలజిస్ట్‌తో వాగ్వాదం

పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించిన ఆందోళనకారులు

నర్సీపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రసవం కోసం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో చేరిన గర్భిణి మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, గైనికాలజిస్టుతో వాగ్వాదానికి దిగారు. ఉదయం వరకు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆకస్మికంగా గుండె ఆగిపోయి మృతిచెందిందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఎస్‌.రాయవరం మండలం చినగుమ్మలూరుకి చెందిన కంటె దేవి(30)కి నెలల నిండడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీశిలించి ఆమెను ప్రసూతి వార్డులో చేర్చారు. సోమవారం రాత్రి డాక్టర్‌ వచ్చి చూసి వెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నొప్పులు అధికం కావడంతో ఆమె అత్త లక్ష్మి, డ్యూటీ నర్సుని నిద్ర లేపారు. ప్రసవానికి ఇంకా సమయం పడుతుందంటూ నర్సు గుమ్మం దగ్గర నుంచే సమాధానం చెప్పి వెళ్లిపోయింది. తర్వాత ఉదయం వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఉమ్మనీరు పోతున్నదని చెప్పగా, నర్సు వచ్చి చూసి, దేవి చనిపోయిందని చెప్పింది. దీంతో అత్త లక్ష్మి బోరున విలపించింది. భర్తీ నానాజీ కుప్పకూలి పోయాడు. వైద్యులు అత్యవసర విభాగం వార్డులో ఉంచి వైద్య సేవలు అందించారు. కాగా గర్భిణి దేవి మృతిచెందిన విషయం తెలుసుకుని చినగుమ్మలూరు నుంచి బంధువులు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు, గైనికాలజిస్ట్‌ లక్ష్మణరావుతో వాగ్వాదానికి దిగారు. గర్భిణితోపాటు కడుపులో బిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గైనికాలజిస్టు లక్ష్మణరావు మాట్లాడుతూ, ఉదయం వరకు పేషెంట్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆకస్మికంగా గుండె ఆగిపోయి మృతిచెందిందని అన్నారు. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని బంధువులు.. నైట్‌ డ్యూటీలో వున్న నర్సుని, డాక్టర్‌ని తమకు అప్పగించాలని, వారితో మాట్లాడతామని అన్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి వచ్చి మృతురాలి బంధువులతో మాట్లాడారు. గర్భిణి మృతిచెందడానికి వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, ఆస్పత్రిలో గొడవ చేస్తే రోగులు ఇబ్బంది పడతారని చెప్పారు. దీంతో వారు శాంతించారు. ఆస్పత్రి అధికారులు అంబులెన్స్‌ ఏర్పాటు చేయగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Updated Date - Dec 25 , 2024 | 12:22 AM