ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరి వర్షార్పణం

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:00 AM

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు కోతలు కోసి వరి పనలను పొలాల్లోనే వదిలేశారు. మరికొందరు కుప్పలు వేశారు. వర్షాలకు ఇవి కూడా నీటమునిగాయి. అయితే వీటిని అధికారులు పంట నష్టం కింద పరిగణించరని తెలిసి రైతులు కలత చెందుతున్నారు.

మార్టూరులో పొలంలోనే తడుస్తున్న వరి పనలు

వాయుగుండం ప్రభావంతో వర్షాలు

కొందరు కోతలు కోసి వరి పనలను పొలాల్లో వదిలేయగా, మరికొందరు కుప్పలు వేసిన వైనం

కోతలు కోసిన వాటిని పంట నష్టం కింద పరిగణించరని తెలిసి ఆవేదన

జిల్లాలో పెద్దగా పంట నష్టం లేదంటున్న వ్యవసాయాధికారులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు కోతలు కోసి వరి పనలను పొలాల్లోనే వదిలేశారు. మరికొందరు కుప్పలు వేశారు. వర్షాలకు ఇవి కూడా నీటమునిగాయి. అయితే వీటిని అధికారులు పంట నష్టం కింద పరిగణించరని తెలిసి రైతులు కలత చెందుతున్నారు.

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 56,410 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేపట్టారు. రెండు రోజుల కిందట వరకు 21,142 హెక్టార్లలో (38 శాతం) వరి కోతలు పూర్తయ్యాయి. 15,524 హెక్టార్లలో వరి కుప్పలు వేసుకున్నారు. 3,038 హెక్టార్లలో వరి పనల మీద ఉందని వ్యవసాయ శాఖ గుర్తించింది. మిగతా 16,706 హెక్టార్లలో వరి కోతలు కోయలేదు. కాగా వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షపు జల్లులతో లోతట్టు ప్రాంతాల్లో కోత దశలో వున్న వరి పైరు నీటమునిగిపోయింది. వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో దేవరాపల్లి, మాడుగుల, చోడవరం, కె.కోటపాడు, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు స్వల్పంగా నీళ్ల పాలైనట్టు గుర్తించారు. ప్రతి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో 5 నుంచి 10 ఎకరాలలోపు వరి పొలాలు మాత్రమే నీటిలో మునిగి ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన శనివారం సాయంత్రానికి 70 నుంచి 100 ఎకరాలలోపే వరి పొలాలు నీటిలో మునిగి ఉన్నాయని, మిగిలిన పంటకు ఎటువంటి నష్టం లేదని అంటున్నారు. నిబంధనల ప్రకారం కోయని వరి పంట నీటిలో మునిగిపోయి 35 శాతానికి పైగా కుళ్లిపోతేనే నష్టం జరిగినట్టు అంచనా వేస్తారు. పనల మీద, కుప్పలు వేసిన పంటకు నష్టం అంచనా వేయరు. దీంతో ఇప్పటికే కోసిన పంట నీళ్ల పాలవడంతో నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలమంచిలి, మునగపాక, రాంబిల్లి, అచ్యుతాపురం, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో వరి పంటకు ఎటువంటి నష్టం లేదని వ్యవసాయాధికారులు తేల్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మడుల్లో పెద్దగా నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదని, అక్కడక్కడా నీరు చేరినా నీరు బయటకు వదలడంతో రైతుకు నష్టం తప్పిందని చెబుతున్నారు.

ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలి

ఇటీవల కురుస్తున్న వర్షాలతో పనల మీద ఉన్న వరి నష్టపోకుండా లీటరు నీటిలో 5 శాతం ఉప్పు కలిపిన ద్రావణంతో (50 గ్రాములు లీటరు నీటికి) కలిపి పనల మీద పిచికారీ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు తెలిపారు. దీని వల్ల గింజ మొలకెత్తకుండా ఉంటుందని, కోత దశకు వచ్చిన వరి పంటను వర్షాలు తగ్గేవరకు కోతల పనులు వాయిదా వేసుకోవడం మేలని సూచించారు. ఇప్పటికే కుప్పలు వేసిన వరి నష్టపోకుండా కుప్పలలో చేరిన వర్షపు నీరుతో గింజ మొలకెత్తకుండా, ధాన్యం రంగు మారకుండా 25 కిలోల గళ్లు ఉప్పు, 25 కిలోల ఊక కలిపి కుప్పలపై చల్లాలని తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 01:00 AM