ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్‌ ఫ్లైఓవర్‌ కమ్‌ మెట్రో కారిడార్‌

ABN, Publish Date - Nov 05 , 2024 | 01:05 AM

భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యేలోగా నగరంలో జాతీయ రహదారిపై ప్రతిపాదిత ఫ్లైఓవర్లను నిర్మించాలన్న విశాఖ ప్రజల డిమాండ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిగణనలోకి తీసుకున్నారు.

Road Cum Metro Corridor

  • రెండు లేయర్ల (డబుల్‌ డెక్కర్‌) నిర్మాణం

  • మూడు నెలల్లో మెట్రో రైలు ప్రాజెక్టు అధ్యయన నివేదిక సిద్ధం

  • 8 ఫ్లైఓవర్లను కలుపుతూ 14 కి.మీ. కారిడార్‌

  • మరో 2 ఫ్లైఓవర్లతో 4 కి.మీ. కారిడార్‌

  • నిధులు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యేలోగా నగరంలో జాతీయ రహదారిపై ప్రతిపాదిత ఫ్లైఓవర్లను నిర్మించాలన్న విశాఖ ప్రజల డిమాండ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిగణనలోకి తీసుకున్నారు. కొమ్మాది నుంచి గాజువాక వరకు నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశలో వీటిని కూడా అంతర్భాగం చేసి పనులు చేపట్టాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. దాంతో అటు మెట్రో రైలు, ఇటు ఫైఓవర్ల నిర్మాణం రెండూ ఒకేసారి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.



ఆ విధంగా మెట్రో కారిడార్

విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు, జాతీయ రహదారిలో ఫ్లైఓవర్ల నిర్మాణంపై రెండు రోజుల క్రితం పురపాలక శాఖా మంత్రి నారాయణ సమక్షంలో వీఎంఆర్‌డీఏలో జరిగిన సమావేశంలో ఒక స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత జూలైలో చేసిన సూచన మేరకు పనులు ఎలా చేపట్టాలనే దానిపై అధికారులు అంతా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. విశాఖపట్నం మీదుగా వెళ్లే జాతీయ రహదారి-16పై ఫ్లైఓవర్ల అవసరం చాలా ఎక్కువగా ఉందని జిల్లా ప్రజా ప్రతినిధులు నొక్కి చెప్పడంతో సీఎం అందుకు అనుగుణంగా మెట్రో కారిడార్‌ డిజైన్‌ మార్చాలని సూచించారు. ఇటు మెట్రో కారిడార్‌, అటు ఫ్లైఓవర్ల రెండూ ఒకే అలైన్‌మెంట్‌లో ఉండాలని స్పష్టంచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రెండు లేయర్ల విధానం (డబుల్‌ డెక్కర్‌)లో కారిడార్‌ ఉండాలన్నారు.



అన్ని శాఖల సమన్వయంతో...

సీఎం చంద్రబాబునాయుడు గత జూలై నెలలో చేసిన సూచనల మేరకు అమరావతి మెట్రో రైలు కారిడార్‌ ప్రాజెక్ట్‌ ఎండీ ఈ బాధ్యతను తీసుకున్నారు. రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి, ఎల్‌ అండ్‌ టి, రైట్స్‌ తదితర ప్రైవేటు ఏజెన్సీలతో చర్చించి ‘రోడ్‌ ఫ్లైఓవర్‌-కమ్‌-మెట్రో కారిడార్‌’ నిర్మాణానికి సాధ్యాసాధ్యాల అధ్యయన నివేదిక మూడు నెలల్లో తయారుచేయాలని నిర్ణయించారు. ఇదే విషయం మంత్రి నారాయణ సమీక్షలో వెల్లడించారు.



మొత్తం పది ఫ్లై ఓవర్లు

మెట్రో రైలుతో పాటు వాహనాలు వెళ్లడానికి వీలుగా నిర్మించదలచిన ‘రోడ్‌ ఫ్లైఓవర్‌-కమ్‌-మెట్రో కారిడార్‌’లో మొత్తం పది ఫ్లైఓవర్లు ఉంటాయని వివరించారు. కొమ్మాది నుంచి గాజువాక వరకు మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశ కాబట్టి అటు నుంచి వస్తే మొదట కార్‌షెడ్‌ జంక్షన్‌ వద్ద 45 మీటర్లు, ఎండాడ వద్ద 45 మీటర్లు, హనుమంతవాక వద్ద 40 మీటర్లు, మద్దిలపాలెం వద్ద 60 మీటర్లు, సత్యం జంక్షన్‌ వద్ద 60 మీటర్లు, గురుద్వారా వద్ద 60 మీటర్లు, అక్కయ్యపాలెం వద్ద 45 మీటర్లు, తాటిచెట్లపాలెం వద్ద 60 మీటర్లు, ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద 60 మీటర్లు, గాజువాక వద్ద 60 మీటర్లు, స్టీల్‌ ప్లాంటు వద్ద 60 మీటర్ల వెడల్పున ఫ్లైఓవర్లు ఏర్పాటుచేస్తారు. ఇవి కాకుండా దువ్వాడలో ఒకటి, లంకెలపాలెంలో మరొక ఫ్లైఓవర్‌ నిర్మించాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ అవి మెట్రో కారిడార్‌ పరిధిలో లేనందున పక్కనపెట్టారు.


ఒక నిర్మాణంలో 8, మరో నిర్మాణంలో రెండు

సింగిల్‌ స్ట్రక్చర్‌ (నిర్మాణం) విధానంలో మెట్రో కారిడార్‌ ప్రాజెక్టు పనులు చేపడతారు. ఒక నిర్మాణంలో ఎనిమిది ఫ్లైఓవర్లను కలుపుతూ 14 కి.మీ., మరో స్ట్రక్చర్‌లో మిగిలిన రెండు ఫ్లైఓవర్లను కలుపుతూ 4 కి.మీ. పొడవైన మార్గాన్ని నిర్మాస్తామని ప్రాజెక్టు ఎండీ వివరించారు.


కేంద్ర నిధులతోనే...

మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలో కొమ్మాది నుంచి గాజువాక వరకు 46.23 కి.మీ. పొడవున నిర్మిస్తారు. దీనికి రూ.11,498 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. దీనికి పూర్తిగా కేంద్రమే నిధులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కోరింది. ఇందులో ఫ్లైఓవర్లు కూడా చేరడంతో వాటికి అదనంగా మరో రూ.3 వేల కోట్లు అవసరం అవుతాయని భావిస్తున్నారు. వీటికి కూడా కేంద్రం సాయం కోరాలని నిర్ణయించారు. ఈ ‘రోడ్‌ ఫ్లైఓవర్లు-కమ్‌-మెట్రో కారిడార్‌’ ప్రాజెక్టుకు మూడు నెలల్లో అంటే 2025 ఫిబ్రవరి మొదటి వారానికి అధ్యయన నివేదిక సిద్ధం అవుతుంది.


ఇవి కూడా చదవండి..

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 02:36 PM