ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవసరం మేరకు ఆర్టీసీ సర్వీసులు

ABN, Publish Date - Dec 23 , 2024 | 12:36 AM

రాష్ట్రంలో ప్రయాణికుల అవసరం మేరకు బస్సు సర్వీసులకు అందుబాటులోకి తెస్తామని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ తెలిపారు.

  • రాష్ట్రానికి 2 వేల ఎలక్ర్టిక్‌ బస్సులు

  • కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి

  • రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌

  • మద్దిలపాలెంలో కొత్త బస్సుల ప్రారంభం

మద్దిలపాలెం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) :

రాష్ట్రంలో ప్రయాణికుల అవసరం మేరకు బస్సు సర్వీసులకు అందుబాటులోకి తెస్తామని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ తెలిపారు. మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో ఆదివారం ఆయన నాలుగు కొత్త బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ర్టానికి సుమారు రెండు వేల ఎలక్ర్టికల్‌ బస్సులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి వస్తుందని, ఇందకోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది కండక్టర్లు, డ్రైవర్లకు మంత్రి పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ దొన్ను దొర, పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, డీటీసీ ఆదినారాయణ, జేసీ మయూర్‌ అశోక్‌, ఆర్టీసీ అధికారులు ఎ.విజయకుమార్‌, బి.అప్పలనాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 12:36 AM