జిల్లాలో ఇసుక అమ్మకాలు
ABN, Publish Date - Dec 25 , 2024 | 12:33 AM
భవన నిర్మాణదారుల సౌకర్యార్థం జిల్లాలో ఆరుచోట్ల ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లిని గోదావరి, కృష్ణ వాటర్ వేస్ అండ్ ట్రాన్స్‌పోర్టు కంపెనీకి కేటాయించామని, ఇక్కడ టన్ను వెయ్యి రూపాయలకు విక్రయిస్తారని, మైత్రి ఇన్‌ఫ్రాకు కేటాయించిన నర్సీపట్నంలో టన్ను రూ.900, చోడవరంలో రూ.1,100, మాడుగులలో రూ.1,100, బీవీఆర్ ఇన్‌ఫ్రాకు కేటాయించిన నక్కపల్లిలో రూ.800, నన్నపనేని ఎర్త్ మూవర్స్‌కు కేటాయించిన అచ్యుతాపురంలో టన్ను ఇసుక వెయ్యి రూపాయలకు విక్రయిస్తారని చెప్పారు.
ఆరు కేంద్రాలు ఏర్పాటు
అనకాపల్లి, అచ్యుతాపురంలో టన్ను రూ.1,000
నర్సీపట్నంలో రూ.900, చోడవరం, మాడుగులలో రూ.1,100
నక్కపల్లిలో రూ.800
అనకాపల్లి కలెక్టరేట్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణదారుల సౌకర్యార్థం జిల్లాలో ఆరుచోట్ల ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లిని గోదావరి, కృష్ణ వాటర్ వేస్ అండ్ ట్రాన్స్‌పోర్టు కంపెనీకి కేటాయించామని, ఇక్కడ టన్ను వెయ్యి రూపాయలకు విక్రయిస్తారని, మైత్రి ఇన్‌ఫ్రాకు కేటాయించిన నర్సీపట్నంలో టన్ను రూ.900, చోడవరంలో రూ.1,100, మాడుగులలో రూ.1,100, బీవీఆర్ ఇన్‌ఫ్రాకు కేటాయించిన నక్కపల్లిలో రూ.800, నన్నపనేని ఎర్త్ మూవర్స్‌కు కేటాయించిన అచ్యుతాపురంలో టన్ను ఇసుక వెయ్యి రూపాయలకు విక్రయిస్తారని చెప్పారు. ఇసుక అవసరమైన వారు తమ వివరాలను ‘శాండ్.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని, రిజిస్ర్టేషన్ కాపీతో ఇసుక నిల్వ కేంద్రం వద్దకు వెళ్లాలని పేర్కొన్నారు. లేదంటే ఇసుక నిల్వ కేంద్రం వద్దకు ఆధార్ కార్డును తీసుకొని వెళ్లి అక్కడ రిజిస్ర్టేషన్ చేయించుకోవాలన్నారు. స్టాక్ పాయింట్ ఇన్‌చార్జి డిజిటల్ పేమెంట్ చేయించుకొని ఇసుక సరఫరా చేస్తారని కలెక్టర్ తెలిపారు.
Updated Date - Dec 25 , 2024 | 12:33 AM