ఎస్సీ కుల గణన జాబితాలు విడుదల
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:21 AM
జిల్లాలో షెడ్యూల్డు కులాల (ఎస్‌సీ) గణనకు సంబంధించిన జాబితాలను విడుదల చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలు అన్ని పంచాయతీ కార్యాలయాలు, గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో వుంటాయని వెల్లడించారు. ఎస్‌సీ కుల గణనపై ఈ నెల 31వ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. పేరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, వయసు, ఉప కులం,
పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాల్లో అందుబాటు
31వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
ఆరో తేదీలోగా నిర్ణయం, 10వ తేదీన తుది జాబితా విడుదల
అనకాపల్లి కలెక్టరేట్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో షెడ్యూల్డు కులాల (ఎస్‌సీ) గణనకు సంబంధించిన జాబితాలను విడుదల చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలు అన్ని పంచాయతీ కార్యాలయాలు, గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో వుంటాయని వెల్లడించారు. ఎస్‌సీ కుల గణనపై ఈ నెల 31వ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. పేరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, వయసు, ఉప కులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, ఇతర వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ డేటాపై అభ్యంతరాలను వీఆర్వోలు స్వీకరిస్తారని, వీటిని మూడు దశల్లో తనిఖీ చేస్తారని తెలిపారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్వో పరిశీలించి వివరాలను సంబంధిత రెవెన్యూ అధికారికి నివేదిస్తారని ఆమె చెప్పారు. వీటిని పునఃపరిశీలించి తహసీల్దార్‌కు సిఫారసు చేస్తారని, తహసీల్దార్ పరిశీలించి తుది ఆమోదం తెలిపిన తరువాత వివరాలను పోర్టల్లో పొందుపరుస్తారని వివరించారు. సోషల్ ఆడిట్‌పై ఈ నెల 31వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, ప్రజల నుంచి అందిన అభ్యంతరాలపై వచ్చే ఏడాది జనవరి ఆరో తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కులగణన తుది వివరాలతో జనవరి 10వ తేదీన జాబితాను విడుదల చేస్తామన్నారు. ఆమె చెప్పారు.
Updated Date - Dec 27 , 2024 | 12:21 AM