ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం

ABN, Publish Date - Dec 23 , 2024 | 08:18 AM

అమరవతి: పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. సముద్రంలో తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీంతో దాని కదలికలను అంచనా వేయడం కష్టమవుతోంది. ఆదివారం తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని మొదట వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే..

అమరవతి: పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతోది. రేపటికి (మంగళవారం) ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లోని దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏపీలోని పోర్టులకు అధికారులు మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కాగా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీంతో దాని కదలికలను అంచనా వేయడం కష్టమవుతోంది. ఆదివారం తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని మొదట వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అల్పపీడనం అవశేషాలు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు.


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేవని, అందుకే ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 (గురువారం) వరకు దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే అల్పపీడనం తీరానికి చేరువగా వెళ్తుందా.. లేదా తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడి, తర్వాత అది వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావించారు. అయితే అది రెండ్రోజులకు తీవ్ర అల్పపీడనంగా మారి ఏపీ తీరం వైపు వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చీకటి జీవోతో బేరం

చెస్‌లో దేవాన్ష్‌ ప్రపంచ రికార్డు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 23 , 2024 | 08:18 AM