AP News: విజయసాయి రెడ్డి నా భార్యను లోబర్చుకొని..: మదన్ మోహన్
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:25 PM
ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ ప్రజాదర్బార్‌కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేష్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నానని, ఎంపీ విజయసాయి రెడ్డి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.
అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ (YSRCP MP) విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) అక్రమాలను బయటపెట్టి.. పోరాడుతున్నందుకు తనను బదిలీ చేయించారని, తన భార్య ( శాంతి (Shanthi)ను లోబర్చుకొని విశాఖపట్నం (Visakhapatnam)లో రూ.1500 కోట్ల విలువైన భూములు (Valuable lands) కొల్లగొట్టారని శాంతి భర్త మదన్ మోహన్ (Madan Mohan) అన్నారు. విజయసాయికి డిఎన్ఎ (DNA) పరీక్షలు నిర్వహించి వాస్తవాలు నిగ్గుతేల్చాలని మంత్రి నారా లోకేష్ (Lokesh)కు కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ ప్రజాదర్బార్‌కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేష్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నానని, ఎంపీ విజయసాయి రెడ్డి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.
2022-23 మధ్య తనను ఏమార్చి అమెరికా పంపిన ఎంపీ విజయసాయి రెడ్డి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారని ఆరోపించారు. తాను స్థానికంగా లేని సమయంలో బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని గట్టిగా విశ్వసిస్తున్నానని, తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మదన్ మోహన్‌కు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ‘శాంతి’ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమెపై భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేయడం.. మీడియా ముందుకొచ్చి శాంతి వివరణ ఇచ్చుకోవడం.. ఈ ఇద్దరి కామెంట్స్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) స్పందించడం ఇదంతా పెద్ద సీరియల్‌నే తలపిస్తోంది. ఈ వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అస్సలు కనిపించట్లేదు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ కూడా జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమృతసర్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు..
తిరుమల లడ్డూ కల్తీలో మరో ట్విస్టు..
ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..
అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 17 , 2024 | 12:29 PM