ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో స్టాంపుల కొరత

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:50 AM

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో స్పెషల్‌ ఎడ్‌హెసివ్‌ స్టాంపుల కొరత వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

బ్యాంకు రుణాలు తీసుకోవాలంటే స్పెషల్‌ ఎడ్‌హెసివ్‌ స్టాంపులు అవసరం

నర్సీపట్నంలో ఏడాది నుంచి అందుబాటులో లేని రూ.100 ఎస్‌ఏ స్టాంపులు

రూ.50, రూ.20, రూ.10 విలువ చేసే స్టాంపులు సైతం కొరత

ఇతర కార్యాలయాల నుంచి రప్పించని అధికారులు

ఇబ్బంది పడుతున్న ప్రజలు

నర్సీపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో స్పెషల్‌ ఎడ్‌హెసివ్‌ స్టాంపుల కొరత వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎడ్‌హెసివ్‌ స్టాంప్స్‌ అవసరం పడుతుంది. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫారాల మీద ఈ స్టాంప్స్‌ అతికించి ఇస్తేనే రుణాలు మంజూరు చేస్తారు. నర్సీపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఎస్‌ఏ స్టాంప్స్‌ లేకపోతే జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయం లేదా వేరే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు నుంచి రప్పించుకోవాలి. కానీ నర్సీపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఎస్‌ఏ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందాలనుకునేవారు ఇబ్బంది పడుతున్నారు. రూ.100 విలువ చేసే స్పెషల్‌ ఎడ్‌హెసివ్‌ స్టాంపులు గత ఏడాది డిసెంబరు నుంచే అందుబాటులో లేవు. ఇది జరిగి ఏడాది దాటిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. రూ.50 విలువ చేసే ఎస్‌ఏ స్టాంపులు ఈ సంవత్సరం ఏప్రిల్‌ 24తో అయిపోయాయి. ఇక రూ.20, రూ.10 విలువ చేసే ఎస్‌ఏ స్టాంపులు నవంబరు 7వ తేదీన, రూ.5 విలువ చేసే స్టాంపులు గత నెల 20వ తేదీన అయిపోయాయి. ఇక కోర్టు ఫీ స్టాంపులు అక్టోబరులో, నోటరీ స్టాంపులు ఈ నెల 13వ తేదీన అయిపోయాయి. బ్యాంకు రుణాలు తీసుకునేవారు స్పెషల్‌ ఎడ్‌హెసివ్‌ స్టాంపుల కోసం కోటవురట్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళుతున్నారు. అక్కడ లేకపోతే నక్కపల్లి, ఎలమంచిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తున్నది. జిల్లా రిజిస్ట్రార్‌కి ఇండెంట్‌ పెట్టినప్పటికీ స్టాక్‌ రాలేదని స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి. దీనిపై జిల్లా రిజిస్ట్రార్‌ మన్మథరావుని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా... ఎక్కువ స్టాక్‌ ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి సర్దుబాటు చేస్తామని చెప్పారు.

Updated Date - Dec 24 , 2024 | 01:50 AM