MP Ramesh: త్వరలోనే అనకాపల్లి టూ రాజమండ్రికి జాతీయ రహదారి
ABN, Publish Date - Jul 20 , 2024 | 04:48 PM
Andhrapradesh: అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి అరులైన్లు విస్తరించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అనకాపల్లి, జూలై 20: అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి అరులైన్లు విస్తరించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం రమేష్ (MP CM Ramesh)వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చోడవరం - మాడుగుల నియోజక వర్గాల మధ్య 5000 ఎకరాలతో సెజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే నక్కపల్లిలో సెజ్ ఏర్పాటు చేస్తామన్నారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఏం తప్పు చేశాడు.. అది ఏమాత్రం సరికాదు
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో మంత్రులను కలుస్తామని చెప్పారు. ఎంపీ ల్యాండ్ నిధులతో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని 1000 గ్రామాలకు పైగా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Gold and Silver Rates: పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు..
Ketireddy Peddareddy: పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 20 , 2024 | 04:50 PM