ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్పెషల్‌బ్రాంచి ప్రక్షాళన

ABN, Publish Date - Dec 25 , 2024 | 01:02 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని స్పెషల్‌బ్రాంచి విభాగం ప్రక్షాళనపై సీపీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు.

  • ఒకేసారి 18 మంది బదిలీ

  • నగర కమిషనర్‌ ఉత్తర్వులు

విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని స్పెషల్‌బ్రాంచి విభాగం ప్రక్షాళనపై సీపీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు. అందులో భాగంగా స్పెషల్‌బ్రాంచిలో పనిచేస్తున్న 18 మంది సిబ్బందిని మంగళవారం ఇతర విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

కమిషనరేట్‌లో స్పెషల్‌ బ్రాంచి విభాగం అతిముఖ్యమైనది. నగరంలో ఎక్కడ ఏం జరుగుతోంది?, పోలీసుల పనితీరు ఎలా ఉంది?, ప్రజలు ఏమనుకుంటున్నారు?, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతర సంఘాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి...ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, అధికారులు, నాయకులు పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను స్పెషల్‌బ్రాంచి ఎప్పటికప్పుడు సేకరించి పోలీస్‌ కమిషనర్‌కు నివేదిక అందజేస్తుంది. ఇందుకోసం ఒక అదనపు డీసీపీ, ఏసీపీ, నలుగురు సీఐలతో పాటు ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఒక ఏఎస్‌ఐ/హెడ్‌కానిస్టేబుల్‌/కానిస్టేబుల్‌ ఉంటారు. వీరంతా మఫ్టీలో తమ పరిధిలో తిరుగుతూ, వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించి తమ పై అధికారుల ద్వారా సీపీకి చేరవేస్తుంటారు. అయితే స్పెషల్‌ బ్రాంచిలో పనిచేస్తున్న సిబ్బంది చాలా ఏళ్లుగా అక్కడే ఉండిపోవడం, గతంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో జనరల్‌ (స్టేషన్‌ ఆదాయ, వ్యయాలు చూడడం) విధులు నిర్వర్తించి ఉండడం వల్ల ఆయా స్టేషన్లలో జరిగే అవినీతి, అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీపీకి కళ్లు, చెవులుగా చెప్పుకునే స్పెషల్‌బ్రాంచి నిర్వీర్యమైపోయిందనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. ఈ విషయం సీపీ దృష్టికి చేరడంతో ఒకేసారి 18 మందిని వేర్వేరు విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. హఠాత్తుగా ఒకేసారి అంతమందిని ఇతర విభాగాలకు బదిలీ చేయడం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

-------------------------------------------------------------------------

29, 30 తేదీల్లో బెనారస్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని రూర్కెలా, జార్సిగూడ సెక్షన్‌లో భద్రతా నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల 29న విశాఖ-బెనారస్‌ ఎక్స్‌ప్రెస్‌ (18311)ను, 30న బెనారస్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18312) రైళ్లు రద్దు చేసినట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. అలాగే ఈ నెల 29న రూర్కెలా, జగదల్‌పూర్‌ మధ్య నడిచే ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (18107/18108) రద్దు చేశామని పేర్కొన్నారు.

బొకారో ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ మీదుగా దన్‌బాద్‌-అలెప్పీ మఽద్య నడుస్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు (13351/13352) ఈ నెల 26 నుంచి శాశ్వత ప్రాతిపదికన అదనంగా ఒక జనరల్‌ సెకండ్‌ క్లాసు సిట్టింగ్‌ కోచ్‌ను జత చేస్తున్నామని సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Updated Date - Dec 25 , 2024 | 01:02 AM