ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: విశాఖలో ఏఆర్‌ఓలకు ట్రైనింగ్... పాల్గొన్న ఏపీ సీఈవో

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:39 PM

Andhrapradesh: 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఆర్‌ఓలకు ట్రైనింగ్ కార్యక్రమం మొదలైంది. రాష్ట్రంలో నేటి నుంచి మూడు చోట్ల ఈ శిక్షణ జరుగనుంది.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: 2024 అసెంబ్లీ ఎన్నికల (AP Elections 2024) నేపథ్యంలో ఏఆర్‌ఓలకు ట్రైనింగ్ కార్యక్రమం మొదలైంది. రాష్ట్రంలో నేటి నుంచి మూడు చోట్ల ఈ శిక్షణ జరుగనుంది. విశాఖలో నిర్వహించిన ట్రైనింగ్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా (AP Chief Election Officer Mukesh Kumar Meena) పాల్గొన్నారు. జాతీయ స్థాయి శిక్షకులు సమీర్ అహ్మద్ జాన్.. ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఏపీ చీఫ్‌ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.... పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాకలు సంబంధించిన ఏఆర్వోలుకు విశాఖ, విజయవాడ తిరుపతి నగరాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడలో అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు, తిరుపతిలో అడిషనల్ కమిషనర్ రవీంద్ర ప్రసాద్ శిక్షణ కార్యాక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ ట్రైనింగ్ క్లాసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా త్రిబుల్ ఐటీ నుంచి నిపుణులు చే ట్రైనింగ్ ఇస్తున్నారన్నారు. ఒక ఫేజ్‌లో 300 మంది వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మూడు పేజ్‌ల్లో సుమారు 1000 మంది పైగా ఆర్వోలు, ఏఆర్వోలు శిక్షణ పొందుతారని తెలిపారు. నేటి నుంచి నుంచి మార్చి 1 వరకు ఈ ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు. సంబంధిత ఆర్వో ఏ.ఆర్.ఓ లు ఎలక్షన్ అయిన నుంచి కౌంటింగ్ అయిన వరకు ఏం చేయాలి అనే దానిపిై శిక్షణ ఇవ్వనున్నట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 12 , 2024 | 12:45 PM

Advertising
Advertising