ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారదర్శకంగా ‘పెసా కమిటీ’ ఎన్నికలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:27 PM

స్థానిక ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో పెసా(పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ షెడ్యూల్డ్‌ యాక్ట్‌) కమిటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ తెలిపారు.

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌, పక్కన డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌

1,026 గ్రామాల్లో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహణ

ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ వెల్లడి

పాడేరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో పెసా(పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ షెడ్యూల్డ్‌ యాక్ట్‌) కమిటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోఆర్‌డీలతో పెసా కమిటీ ఎన్నికలపై సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని 11 షెడ్యూల్డ్‌ మండలాల్లో 239 గ్రామ పంచాయతీలు, మైదాన ప్రాంతమైన నాతవరం మండలంలోని 5 నాన్‌షెడ్యూల్డ్‌ పంచాయతీలు కలిపి మొత్తం 244 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,026 గ్రామాల్లో పెసా కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు పెసా కమిటీలకు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. పార్టీలకు అతీతంగా చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల్లో గెలిచిన వారు ఐదేళ్లు పదవుల్లో ఉంటారన్నారు. ఆయా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారీలో నిమగ్నం కావడంతోపాటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖతో సమన్వయం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అభిషేక్‌ సూచించారు.

ఎన్నికల అధికారుల నియామకానికి చర్యలు

ఐటీడీఏ పరిధిలోని 244 గ్రామ పంచాయతీల పరిధిలో పెసా కమిటీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారుల నియామకానికి ఎంపీడీవోలు చర్యలు చేపట్టాలని డివిజనల్‌ లెవల్‌ పంచాయతీ అధికారి పీఎస్‌ కుమార్‌ సూచించారు. తక్షణమే ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అఽధికారుల నియామకం చేపట్టాలని, ఈ ఎన్నికలను ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా పెసా కమిటీ ఎన్నికల నిర్వహణపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవోలు వీఎస్‌ ప్రభాకరరావు, ఎ.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు ఎల్‌.రజని, ఆర్వోఎఫ్‌ఆర్‌ డీటీ ఈశ్వరరావు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోఆర్‌డీలు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:27 PM