రెండు బైక్‌లు ఢీ : ఇద్దరి మృతి

ABN, Publish Date - Aug 22 , 2024 | 11:58 PM

అరకులోయ-లోతేరు రోడ్డులోని నాంది ఫౌండేషన్‌ పల్పింగ్‌ సెంటర్‌ సమీపంలో గురువారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

రెండు బైక్‌లు ఢీ : ఇద్దరి మృతి
Two Dead

అరకులోయ, ఆగస్టు 22: అరకులోయ-లోతేరు రోడ్డులోని నాంది ఫౌండేషన్‌ పల్పింగ్‌ సెంటర్‌ సమీపంలో గురువారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


మండలంలోని పెదలబుడు గ్రామంలో గురువారం శుభకార్యం జరుగుతోంది. పెదలబుడుకు చెందిన జన్ని మనస్సే(17) అరకులోయకు పని మీద బైక్‌పై వస్తుండగా.. అదే శుభకార్యానికి అరకులోయ నుంచి పెదలబుడుకు చొంపి గ్రామానికి చెందిన దేవసురేంద్రనాయక్‌ (22)మరో ఇద్దరు యువకులతో బైక్‌ వెళుతున్నారు. నాంది ఫౌండేషన్‌ పల్పింగ్‌ సెంటర్‌ సమీపంలోకి వచ్చేసరికి రెండు బైక్‌లు బలంగా ఢీకొన్నాయి. దీంతో ఘటనా స్థలంలోనే మనస్సే, దేవసురేంద్రనాయక్‌ మృతి చెందారు. ఈ ప్రమాదంలో చొంపి గ్రామానికి చెందిన దళపతి సిద్ధు (20), పెలమల ధనూష్‌ గాయపడ్డారు. వీరిని 108లో అరకులోయ ఏరియా ఆస్పత్రి తరలించి, వైద్య సేవలందించారు. మృతి చెందిన మనస్సే ఇంట్లోనే శుభకార్యం జరుగుతోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ. ఆర్‌.సంతోష్‌కుమార్‌, ఏఎస్‌ఐ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Aug 23 , 2024 | 06:15 PM

Advertising
Advertising
<