ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాయుగండం

ABN, Publish Date - Dec 21 , 2024 | 12:34 AM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం వాయుగుండంగా బలపడడంతో జిల్లా అంతటా వర్షాలు పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జల్లులు పడుతూనే ఉన్నాయి. సాయంత్రం తరువాత వర్షం తీవ్రత పెరిగింది. సముద్రతీర మండలాలతోపాటు వీటికి ఆనుకుని వున్న మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

సబ్బవరం మండలం ఇరువాడలో నీటిలో తేలుతున్న వరి పనలు

జిల్లా అంతటా పెరిగిన వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం

కుప్పలు వేయని పొలాల్లో తడిసిపోయిన వరి పనలు

లోతట్టు భూముల్లో నీట మునిగిన పనలు

భారీ వర్షాల హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

పలు శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం

వరి పంటకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌:

టోల్‌ ఫ్రీ నంబర్లు: 08924- 226599, 222888

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం వాయుగుండంగా బలపడడంతో జిల్లా అంతటా వర్షాలు పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జల్లులు పడుతూనే ఉన్నాయి. సాయంత్రం తరువాత వర్షం తీవ్రత పెరిగింది. సముద్రతీర మండలాలతోపాటు వీటికి ఆనుకుని వున్న మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వరితోపాటు ఇతర పంటల రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి కోతలు పూర్తిచేసి, గురువారం వరకు కుప్ప వేయని పొలాల్లో వరి పనలు తడిసిముద్దయ్యాయి. కొన్నిచోట్ల వరి పనలు నీటిలో తేలుతున్నాయి. కొంతమంది రైతులు వరి పంటను కాపాడుకోవడానికి పనలను గట్లపైనే, ఎత్తయిన ప్రదేశాలకు చేరుస్తున్నారు. ధాన్యం మొలకెత్తకుండా వుండడానికి పనలపై ఉప్పునీటి ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.

పొలాల్లో నుంచి వర్షం నీటిని బయటకు పంపడానికి కాలువలు తీసుకున్నారు. మరో రెండు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో వరి కంకులు మొలకెత్తే ప్రమాదం వుందని ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీటి ప్రవాహనంలో వరి పనలు కొట్టుకుపోతాయని గుబులు చెందుతున్నారు. కాగా వరి కుప్పలు వేయలేకపోయిన వారిలో ఎక్కువ మంది రైతులు దేవుడిపైనే భారం వేశారు. ఇదిలావుండగా వరి పైరు కోయని పొలాల్లో ఈదురు గాలుల కారణంగా పంట నేలవాలింది. వర్షాలు అధికమైతే పొలాల్లో నీరు నిలిచిపోయి వరి కంకులు నీటిలో నానిపోయి ధాన్యం రంగుమారుతుందని, మొలకెత్తే అవకాశం కూడా వుందని రైతులు వాపోతున్నారు.

అనకాపల్లి పట్టణంలో ముసురు వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు అడపాదడపా జల్లులు కురవగా, అనంతరం వర్షం పెరిగింది. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పరవాడ మండలంలోనిఇ పరవాడ, తానాం, స్వయంభూవరం, కొత్త వెన్నెలపాలెం, గొల్లలపాలెంలో కోతకు వచ్చిన వరి పంట ఈదురు గాలులతో నేవాలింది. కోత కోసి కుప్ప వేయని పొలాల్లో వరి పనలు నీటమునిగాయి.

రోలుగుంట మండలంలో రోలుగుంట, బీబీపట్నం, కొమరవోలు తదితర గ్రామాల్లో కోసిన వరి పనలు నీట మునగడంతో ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రంగుమారడమే కాకుండా మొలకెత్తే అవకాశం ఉందని వాపోతున్నారు.

గొలుగొండ మండలం పాతమల్లంపేట, గొలుగొండ, చీడిగుమ్మల, అమ్మపేట, జోగంపేట, పప్పుశెట్టిపాలెం, కొత్తమల్లంపేట, కొత్తఎల్లవరం, సీహెచ్‌.నాగాపురం, పల్లావూరు, ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవిపేట, కొంగసింగి, విప్పలపాలెం, తదితర గ్రామాల్లో సుమారు 200 హెక్టారుల్లో వరి పనులు కుప్ప వేయలేదు. వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకవరపాలెం మండలంలో మాకవరపాలెం, తామరం, కొండలఅగ్రహారం, బయ్యవరం, గిడుతూరు, మల్లవరం, పైడిపాల తదితర గ్రామాల్లో వర్షానికి వరి పనులు తడిసిపోయాయి.

రాంబిల్లి మండలంలో 52.7 హెక్టార్లులో వరి పనలు తడిసిపోయాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సబ్బవరం మండలంలో గొర్లివానిపాలెం, ఇరువాడ, అసకపల్లి, గుల్లేపల్లి, వంగలి, మలునాయుడుపాలెం తదితర గ్రామాల్లో పలువురు రైతులకు చెందిన వరి పనలు వర్షానికి తడిసిపోయి నీట మునిగాయి. కోత కోసిన తరువాత పనలు పూర్తిగా ఎండకపోవడంతో కుప్పలు వేయలేకపోయామని చెబుతున్నారు.

వర్షపాతం వివరాలు

జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా దేవరాపల్లి మండలంలో 24.2 మిల్లీ మీటర్లు, సబ్బవరం మండలంలో 22.2 మి.మీ.ల వర్షం కురిసింది. మాడుగులలో 9.2 మి.మీ.లు, కె.కోటపాడులో 15.8, పరవాడలో 10.2, రావికమతంలో 3.3, అనకాపల్లిలో 11.6, చీడికాడలో 12.2, బుచ్చెయ్యపేటలో 5.6, కశింకోటలో 12.4, అచ్యుతాపురంలో 6, మునగపాకలో 5.4, రాంబిల్లిలో 10.5, చోడవరంలో 10.2, ఎలమంచిలిలో 6.6, రోలుగుంటలో 5.8, నర్సీపట్నంలో 5,5, ఎస్‌.రాయవరంలో 5.4, మాకవరపాలెంలో 4.6, కోటవురట్లలో 3.8, నక్కపల్లిలో 2, గొలుగొండలో 3.2, నాతవరంలో 1.4, పాయకరావుపేటలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అధికారులు అప్రమత్తం....

జిల్లాలో వర్షాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వెబెక్స్‌ ద్వారా మండలాల్లో వర్షాలు, పంట నష్టం, ఇతరత్రా వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. సముద్ర తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, మరో రెండు, మూడు రోజులు వేట నిషేధాన్ని అమలు చేయాలని మత్స్య శాఖాధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మండల పరిషత్‌, వైద్య, విద్యుత్‌ శాఖల అధికారులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు. మరో రెండు రోజులపాటు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అందుబాటులో ఉంటుందని, అన్ని మండల కేంద్రాల్లో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వర్షాలు, నష్టాలపై సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబర్లు (08924- 226599, 222888)కు అందించాలని సూచించారు.

కలెక్టర్‌ సమీక్ష

జిల్లాలో వర్షాలు పెరగనున్న నేపథ్యంలో రైతులు వరి పంట నష్టపోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పలు శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, పంచాయతీరాజ్‌, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు భవనాలు, నీటి పారుదల, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య, పశు సంవర్థక, తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో అన్ని మండలాల ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో మండలస్థాయి అధికారులు ఆయా కేంద్రాల్లోనే వుండాలని సూచించారు.

Updated Date - Dec 21 , 2024 | 12:35 AM