ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP.. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారు: విష్ణుకుమార్ రాజు

ABN, Publish Date - Feb 01 , 2024 | 01:55 PM

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరపడిందని... ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎంకు లేదని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరపడిందని... ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎంకు లేదని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం విశాఖలో పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి, విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేస్తే మెడకు ఉరితాడు బిగించుకున్నట్లేనని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని.. మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ భీమిలిలో 40 వేల మంది పట్టే స్థలంలో ‘సిద్ధం’ సభ నిర్వహించి నాలుగు లక్షల మంది వచ్చారని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా పోరు కార్యక్రమంలో జగన్ చేసిన దుర్మార్గాలను ఎండగడతామన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ.. 25 లోక్ సభ నియోజకవర్గాలలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కార్యాలయాలను ప్రారంభించామన్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని సీతారామాంజనేయ చౌదరి పేర్కొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 01:55 PM

Advertising
Advertising