ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నగరంలో వైట్‌టాప్‌ రోడ్లు!

ABN, Publish Date - Dec 23 , 2024 | 12:38 AM

నగరంలో బ్లాక్‌టాప్‌ (తారురోడ్డు) స్థానంలో వైట్‌టాప్‌ (సిమ్మెంట్‌ కాంక్రీట్‌మిక్స్‌) రోడ్లు రాబోతున్నాయి.

  • తారురోడ్డుకి బదులుగా జీవీఎంసీ కొత్తఆ లోచన

  • ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు

  • తొలిదశలో 25 కిలోమీటర్లు వేసే యోచన

  • గ్లోబల్‌టెండర్‌ విధానం అమలుకు నిర్ణయం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో బ్లాక్‌టాప్‌ (తారురోడ్డు) స్థానంలో వైట్‌టాప్‌ (సిమ్మెంట్‌ కాంక్రీట్‌మిక్స్‌) రోడ్లు రాబోతున్నాయి. రోడ్ల నిర్వహణను మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ ముఖ్యమైన రోడ్ల నిర్వహణను ఇకపై గ్లోబల్‌ టెండర్‌ ద్వారా పెద్ద సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీవీఎంసీ పరిధిలో మొదటిదశలో 25 కిలోమీటర్ల మేర ప్రధానరోడ్లను వైట్‌టాప్‌రోడ్లుగా మార్చనున్నారు.

జీవీఎంసీలో 30 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పుకలిగిన ముఖ్యమైన రోడ్లు సుమారు 250 కిలోమీటర్లు మేర విస్తరించి ఉన్నాయి. ఆయా రోడ్లు పాడైపోయినా, గుంతలు పడినా జీవీఎంసీ టెండర్ల ద్వారా నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. పాడైన రోడ్లపై కొత్తగా తారులేయరు వేయడానికి, గుంతలు పూడ్చడానికి ఏటా సగటున రూ.వంద కోట్లు ఖర్చు చేస్తోంది. ఆయా పనులు చేపట్టడానికి స్ర్టెచ్‌లవారీగా టెండరు పిలిచి తక్కువకు (ఎల్‌1) కోట్‌చేసిన కాంట్రాక్టర్‌కు అప్పగిస్తోంది. అయితే చాలామంది కాంట్రాక్టర్ల వద్ద తారురోడ్డు నిర్మాణానికి అవసరమైన యంత్రాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న వాటిని అద్దెకు తీసుకుని పనులు పూర్తిచేస్తున్నారు. దీనివల్ల రోడ్ల నిర్మాణం ఒకేరీతిలో లేకపోవడం, ఎడ్జ్‌లను సక్రమంగా రోలింగ్‌ చేయలేకపోతున్నారు. దీనవల్ల రోడ్ల జీవితకాలం నిర్ణీత గడువుకు ముందే పాడైపోతున్నాయి. పైగా రోడ్డు వెడల్పు (మార్జిన్‌) ఏకరూపంలో కాకుండా వంకర టింకరగా, ఎత్తుపల్లాలుగా ఉంటోంది. కొత్తగా నిర్మించిన రోడ్లు అయినప్పటికీ చూడడానికి ఆకర్షణీయంగా లేవు. రోడ్డు నిర్మించిన తర్వాత సంబంధిత కాంట్రాక్టరే కొంతవ్యవధి వరకూ నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉన్నప్పటికీ బిల్లు అందగానే గాలికి వదిలేస్తున్నారు. దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి వీలుండడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సమస్య పరిష్కారానికి శాశ్వతచర్యలు తీసుకోవాలని భావించింది.

రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఇకపై ఒక్కో స్ర్టెచ్‌కు కాకుండా 30 అడుగులు అంతకంటే ఎక్కువ వెడల్పుకలిగిన రోడ్లకు మరమ్మతులు, అవసరమైతే కొత్తలేయర్లు నిర్మాణం కోసం రెండేళ్ల కాలవ్యవధితో గ్లోబల్‌టెండర్‌ విధానం అమలుచేయాలని నిర్ణయించింది. జీవీఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణం కోసం ఏటా సుమారు రూ.వంద కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఐదేళ్లకు రూ.500 కోట్లు వరకూ ఖర్చవుతోంది. అదే మొత్తానికి ఐదేళ్ల నిర్వహణ చూసేలా ఎల్‌అండ్‌టీ, షాపూర్‌పల్లొంజి, ఎన్‌సీసీ, నవయుగ వంటి పెద్దసంస్థల నుంచి గ్లోబల్‌ టెండర్‌ పిలవాలని రాష్ట్రంలోని అన్ని పట్టణస్థానికల సంస్థలకు మౌఖికంగా ఆదేశించింది. జీవీఎంసీ పరిధిలో 30 అడుగులు అంతకంటే వెడల్పు కలిగిన రోడ్లు, వాటి ప్రస్తుత పరిస్థితి తదితర వివరాలతో నివేదిక తయారుచేసి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి పంపించింది. వర్షాకాలంలో నీరునిలిచిపోవడం, భారీవాహనాల వాహనాల రాపిడికి నీరుచేరిన చోట తారు పైకి లేచిపోవడం వల్ల వారం, పదిరోజులకే గుంతలు పడుతున్నాయని అధికారులు గుర్తించారు. దీనివల్ల రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించినప్పటికీ ప్రయోజనం లేదని అధికారులు చెబుతున్నారు. సిమ్మెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ (వైట్‌టాప్‌)తో రోడ్లను నిర్మిస్తే ఎంతవర్షం నీరు నిలిచినా ఇబ్బంది ఉండదని, పైగా వాహనాల తాకిడిని తట్టుకునే సామర్థ్యం ఎక్కువని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు నగరంలో తొలివిడతగా 25 కిలోమీటర్లు వైట్‌టాప్‌ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతి లభిస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 12:38 AM