YCP MLC: వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్సీ వీడియో నిజమేనా..?
ABN, Publish Date - Aug 25 , 2024 | 01:56 PM
అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహార శైలి తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రచ్చ రచ్చ చేసింది. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ల వ్యవహారం ట్రెండింగ్ అయింది. ఇది కాస్త మరుగున పడిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో ఎమ్మెల్సీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC) అనంతబాబు (Anantha Babu) వ్యవహార శైలి తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (MLC Duvvada Srinivas) ఎపిసోడ్ రచ్చ రచ్చ చేసింది. దివ్వెల మాధురి (Divvela Madhuri), దువ్వాడ శ్రీనివాస్‌ల వ్యవహారం ట్రెండింగ్ (Trending) అయింది. ఇది కాస్త మరుగున పడిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో ఎమ్మెల్సీ వీడియో (Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వీడియో కాల్‌లో మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అందులో క్లియర్‌గా కనిపించింది. ఇప్పుడది తీవ్ర ధుమారం రేపుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కాల్‌లో అవతలివారితో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అనంతబాబు.. ముద్దులు పెట్టడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పూర్తిగా రికార్డు అయింది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఎమ్మెల్సీ అనంతబాబు స్పందించారు. అది మార్పింగ్ చేసిన వీడియో అని అన్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా వీడియో కాల్‌లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని ఎడిట్ చేశారని అనంతబాబు చెప్పారు. మార్పింగ్ వీడియోలతో గత ఆరు నెలలుగా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన అంటున్నారు. తన వీడియోలను మార్పింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. హనీ ట్రాప్ చేసి తనను ఉద్దేశ పూర్వకంగానే ఈ వీడియోలో ఇరికించారని ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపించారు. గతంలో గోరంట్ల మాధవ్ వీడియో కూడా రిలీజ్ అయిందని, అంతకుముందు అంబటి రాంబాబు, అవంతీ శ్రీనివాస్.. అలాగే కొద్ది రోజుల క్రితం విజయసాయి రెడ్డికి సంబంధించిన అంశం కూడా రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే.
గతంలో అనంతబాబు తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు సీఎంగా ఉన్న జగన్ చర్యలు తీసుకోకుండా ఆయనను వెంటేసుకుని తిరిగారు. అనంతబాబు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఏదో గొప్ప పని చేసి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిగా చూపించి.. వైసీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతాలు పలికి డప్పులు, డ్యాన్సులు, ఊరేగింపులు చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ వీడియో బయటకు వచ్చింది. ఇది చూపించడానికి అసహ్యంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎమ్మెల్సీ అయిన అనంతబాబు చట్ట సభలో హుందాగా ఉండాల్సిన వ్యక్తి.. ఈ విధంగా ప్రవర్తించడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాంటి వాళ్లను ఉపేక్షిస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అనంతబాబుపై గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. రంగురాళ్లు, కలప అక్రమ రవాణ, ఆయనొక వీధి రౌడీగా ప్రవర్తిస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పద మృతి
మెడికల్ కాలేజ్ కూల్చే కుట్ర: పల్లా రాజేశ్వర్ రెడ్డి
తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..
నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 25 , 2024 | 02:02 PM