world book of record: బొంతలకోటికి అరుదైన గౌరవం
ABN, Publish Date - Dec 29 , 2024 | 11:47 PM
world book of record: ఇరవై ఐదు సంవత్సరాలుగా కళారూ పాలతో సంగీత వాయిద్య పరికరాలతో కళా బోధనచేస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు డిగా పేరొందిన డాక్టర్ బొంతలకోటి శంకర రావుకు వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది.
గజపతినగరం, డిసెంబరు29 (ఆంధ్రజ్యో తి): ఇరవై ఐదు సంవత్సరాలుగా కళారూ పాలతో సంగీత వాయిద్య పరికరాలతో కళా బోధనచేస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు డిగా పేరొందిన డాక్టర్ బొంతలకోటి శంకర రావుకు వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. ఈవిషయాన్ని ఆయనే విలేకరుల కు ఆదివారం తెలిపారు. ఈనెల 11న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు నమోదైనట్లు వివరించారు. మరుగున పడిపోతున్న జాన పద కళారూపాలను బతికిస్తూ.. మరో పక్క ప్రస్తుత తరానికి జానపద కళారూపాల ప్రాధాన్యం తెలియజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు బడి అంటే భయం దూరం చేసే కళా బోధన విధానాన్ని అమలు చేస్తూ కొత్త ఒరవడికి అంకురార్పణ చేసినందుకు ప్రపంచ రికార్డులో తనకు స్థానం లభించిందన్నారు. మెంటాడ మండల గుర్లతమ్మిరాజుపేట హైస్కూలులో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విదులు నిర్వహిస్తున్న ఆయన గజపతినగరం పట్టణంలో నివాసం ఉంటున్నారు. బొంతలకోటికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కడంపై జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడు అభినందించారు.
Updated Date - Dec 29 , 2024 | 11:47 PM