రక్తహీనత నివారణకు ‘ఆరోగ్య అమృత’ కిట్లు
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:14 AM
జిల్లాలో రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఆరోగ్య అమృత ఆహారం కిట్లును అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు.
పార్వతీపురం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఆరోగ్య అమృత ఆహారం కిట్లును అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. జిల్లాలోని గర్భిణుల్లో రక్తహీనత నివారణ, వీడీవీకేల నిర్వహణ, పీఎంఈజీపీలపై గురువారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అంగన్‌వాడీల ద్వారా ఇప్పటికే ప్రభుత్వం నుంచి గర్భిణులకు పోషకాహారం అందుతుంది.. దానికి అదనంగా ఎన్జీవోలు, మహిళా సంఘాల సహకారంతో ఆరోగ్య అమృత ఆహారం కిట్లును ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఇందులో స్వయం సహాయక బృందాల పాత్ర కీలకమన్నారు. ఈ కిట్లను జిల్లాలో జనవరి 1వ తేదీ నుంచి అనీమియా యాక్షన్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. అనీమియాను పూర్తిగా నిర్మూలించేందుకు కొంత సమయం పట్టనున్నందున ఈలోగా సగానికిపైగా కేసులు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎంలను ఆదేశించారు. వీడీవీకేల ద్వారా జీడి పరిశ్రమను నెలకొల్పేలా ఆలోచన చేస్తున్నామని, ఇందుకు పార్వతీపురం పాచిపెంట ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పథక సంచాలకుడు వై.సత్యంనాయుడు, జిల్లా పశుసంవర్థక అధికారి మన్మథరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎం.వినోద్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 12:14 AM