JJM Works జేజేఎం పనులు పూర్తి చేయండి
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:58 PM
Complete JJM Works వీలైనంత త్వరగా జిల్లాలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులు పూర్తిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వీలైనంత త్వరగా జిల్లాలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులు పూర్తిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జేజేఎం కింద ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా కావాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు దిశా నిర్దేశం చేశారు. దీనికోసం దగ్గరలో ఉన్న నీటి వనరుల సౌలభ్యాన్ని చూసుకోవాలన్నారు. తోటపల్లి, వెంగళరాయసాగర్ ద్వారా అదనంగా తాగునీటిని సరఫరా చేసేందుకు డీపీఆర్‌ను రూపొందించాలని సూచించారు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, జలవనరుల, భూగర్భ శాఖల అధికారులు ఓ.ప్రభాకరరావు, ఆర్.అప్పలనాయుడు, రాజశేఖరరెడ్డి, ఎంపీడీవోలు, సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 11:58 PM