సౌకర్యాలు లేక.. గిట్టుబాటు కాక
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:22 AM
జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతంలో మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా ప్రభుత్వాలు మారుతున్నా వీరి జీవనం పరిస్థితి మారడం లేదు. తీర ప్రాంతంలో మత్స్యసంపద వేట, వాటిని అమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. దీనికితోడు వీరు సేకరించే మత్స్యసంపదకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ధర లభించే సమయంలో విక్రయించేందుకు గడ్డింగులు సైతం నిర్మాణానికి నోచుకోవడంలేదు.
భోగాపురం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతంలో మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా ప్రభుత్వాలు మారుతున్నా వీరి జీవనం పరిస్థితి మారడం లేదు. తీర ప్రాంతంలో మత్స్యసంపద వేట, వాటిని అమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. దీనికితోడు వీరు సేకరించే మత్స్యసంపదకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ధర లభించే సమయంలో విక్రయించేందుకు గడ్డింగులు సైతం నిర్మాణానికి నోచుకోవడంలేదు.
కమ్యూనిటీ భవనాలు లేక..
జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో గల 17 తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు చేపలవేటపై ఆధారపడి 30 వేల మంది జీవిస్తున్నారు. మత్స్యకారులు వేట సాగించి తీరానికి తీసుకొచ్చిన చేపలు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. చేపలు నిల్వ చేసుకోవడానికి సౌకర్యం లేక పోవడంతో తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. సముద్రంలో సేకరించిన మత్స్య సంపదను ఆరబెట్టి విక్రయించేందుకు ప్లాట్‌ఫారాలు, శీతల గిడ్డంగులు వంటి సౌకర్యాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు. ఈ ఏడాది మత్స్యకార భరోసా కూడా ఇప్ప టివరకూ ఇవ్వలేదని చెబుతు న్నారు. వలలు దాచు కునేందుకు భవనాలు సైతం తీరం లేవు. గతంలో కొండరాజుపాలెంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. వేటాడిన తర్వాత తీరంలో సేదదీరడానికి కమ్యూనిటీ భవనాలు సైతం నిర్మించలేదని మత్స్యకారులు వాపోతున్నారు. సముద్రం లో దొరికే చిన్న చేపలు తక్కువ ధర పలుకు తాయని, వాటిని ఆరబెట్టి అమ్మకాలు జరిపితే ధర కాస్త అధికంగా వస్తుందని మహిళలు చెబుతు న్నారు. అయితే చేపలు ఆరవేసుకోవడానికి తీరంలో నిర్మించిన ఫ్లాట్‌పారా లు శిథిలావస్థకు చేరాయి. పలు గ్రామాల్లో ఫ్లాట్‌పారాలు లేకపోవడంతో తీరంలో వలలు వేసి చేపలు ఆరవేసుకోవలసి వస్తోందని, దీంతో ఎండిన చేపలకు ఇసుక అతుక్కొని ధర తక్కువగా లభిస్తోందని వాపోతున్నారు.
Updated Date - Dec 22 , 2024 | 12:22 AM