ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి

ABN, Publish Date - Dec 31 , 2024 | 12:09 AM

ఏపీఎస్‌ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లను రద్దు చేసి, విధుల్లోకి తీసుకోవాలని పార్వతీపురం ఎంప్లాయీస్‌ యూనియన్‌ మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు కోరారు.

డిపో గేటు వద్ద నిరసన చేస్తున్న ఈయూ సంఘ సభ్యులు

పార్వతీపురంటౌన్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లను రద్దు చేసి, విధుల్లోకి తీసుకోవాలని పార్వతీపురం ఎంప్లాయీస్‌ యూనియన్‌ మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు సోమ వారం స్థానిక డిపో గేటు వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ 1/2019 సర్క్యులర్‌లను పూర్తిగా అమలు చేయాలన్నా రు. ఇటీవల ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. బస్సుల రన్నింగ్‌ టైములకు సరిపోని రూట్లలో సమగ్ర సర్వేలు జరిపి కచ్చితమైన టైములతో షెడ్యూలు అమలు పరచాలన్నారు. వర్క్‌షాపుల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారించాలని, డ్రైవర్‌, కండక్టర్‌ డ్యూటీ చార్జులు అవసరమైనటువంటి డిపోల్లో తక్షణమే ఏర్పాటు చేయాలన్నా రు. ఉద్యోగస్తులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ, చనిపోయి న వారికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని ఆయా డిపోల్లో గల గ్యారేజీ ఉద్యోగస్థుల సమస్యలను పరిష్క రించి, వారికి అవసరమైన పరికరాలను పంపిణీ చేయాలన్నారు. అధికా రులు, సూపర్‌వైజర్ల ఏకపక్ష నిర్ణయాలపై తగు విచారణ జరిపి న్యా యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టీవీ నాయుడు, డిపో సెక్రటరీ నర్సింగరావు, నాయకులు పీఎల్‌ నాయుడు, జి.శ్రీనివాస్‌, శంకర్‌, టీకేఎస్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:09 AM