ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

no one talk ఫ్రీహోల్డ్‌పై నోరెత్తలేదు!

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:03 PM

No mention of freehold!

వేపాడ మండలం కేజీపూడి రెవెన్యూ సదస్సులో అర్జీల స్వీకరణ

ఫ్రీహోల్డ్‌పై నోరెత్తలేదు!

కేజీ పూడి అసైన్డ్‌ భూముల రైతుల్లో నిరాశ

మొక్కుబడిగా రెవెన్యూ సదస్సు

జాయింట్‌ పట్టా రైతుల్లో ఆందోళన

ఇంకెవరికైనారిజిస్ట్రేషన్‌ అయిందేమోనని ఆరా

వైసీపీ ప్రభుత్వంలో 2022 నుంచి 2024 వరకు వేపాడ తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసిన అధికారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మకయ్యారు. అసైన్డ్‌ ల్యాండ్‌ చట్టానికి వ్యతిరేకంగా 22(ఎ)లో ఉన్న భూములను ఫ్రీహోల్డ్‌ జీవోను అడ్డం పెట్టుకుని దారదత్తం చేశారు. వెంటవెంటనే ఆన్‌లైన్‌ చేసేశారు. 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న మా భూములకు మాత్రం మోక్షం లేదు. ఫ్రీహోల్డ్‌ వర్తింప చేయలేదు.

- వేపాడ మండలం కొండగంగుపూడికు చెందిన గిరిజన రైతుల ఆవేదన

నేను పేద గిరిజన మహిళను. వ్యవసాయం చేసుకొనేందుకు 1987లో రెండు కుటుంబాలకు కలిపి 4.97 ఎకరాలతో జాయింట్‌ పట్టాను ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటి నుంచి చెరో సగం భూమిని సాగు చేస్తున్నాం. కొన్నాళ్ల కిందట నా భర్త చనిపోయాడు. జాయింట్‌ పట్టాను విడదీసి ప్రత్యేకంగా పట్టా ఇవ్వాలని పలుమార్లు వేపాడ మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా గ్రామంలోని భూములను పట్టణాలకు చెందిన పెద్దోళ్లు కొనుగోలు చేశారని, వారి పేరున భూములు రిజిస్ర్టేషన్‌ అయిపోయాయని అంతా చెప్పుకుంటుండడంతో భయమేస్తోంది.

- ఓ గిరిజన మహిళా రైతు ఆవేదన

శృంగవరపుకోట, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి):

వేపాడ మండలం కొండగంగుపూడి(కేజీపూడి) గ్రామ రెవెన్యూ సదస్సులో పలువురు గిరిజన రైతులు సోమవారం గోడు వెళ్లబుచ్చుకున్నారు. సదస్సులో ఫ్రీహోల్డ్‌ జరిగిన అసైన్డ్‌ భూముల వివరాలను బయటపెడతారని అందరూ ఎదురు చూశారు. కనీసం ఫ్రీహోల్డ్‌ భూములను కొనుగోలు చేసిన యజమానుల వివరాలైనా చెబుతారని ఆశించారు. గ్రామ రెవెన్యూ సదస్సులకు వచ్చిన అధికారులెవరూ వీటి గురించే నోరెత్తలేదు. అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌ వ్యవహారం రెవెన్యూ సదస్సుతో సంబంధం లేదన్న విధంగా ప్రవర్తించారు. గ్రామస్థులు ఇచ్చిన అర్జీలను స్వీకరించడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో స్థానికులు తీవ్ర నిరాశ పడ్డారు.

వాస్తవానికి కేజీపూడి గ్రామానికి చెందిన ఫ్రీహోల్డ్‌ భూముల వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. శృంగవరపుకోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్‌ జరగడంతో రాష్ట్ర భూ పరిపాలన శాఖ (సీసీఎల్‌ఏ) ముఖ్యకార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఆగస్టులో ప్రత్యేకంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌ తంతులో జరిగిన అవకతవకలకు అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ను బాధ్యుడిని చేశారు. అంతేకాకుండా ఈ భూముల ఫ్రీహోల్డ్‌ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగిందో లేదో చూడాలని కలెక్టర్‌ బీ.ఆర్‌ అంబేడ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌లకు అప్పగించారు. ఆ తర్వాత తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు పలుమార్లు రికార్డులను కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. జిల్లా ఉన్నతాధికారులు వాటిని పునఃపరిశీలించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని గ్రామ రెవెన్యూ సదస్సులో అధికారులు ప్రస్తావించకపోవడం అందరినీ విస్తు గొలిపింది. విమర్శలకు తావిచ్చింది.

జాయింట్‌ పట్టాదారుల్లో వీడని ఆందోళన

కేజీపూడి గ్రామంలో ప్రభుత్వ భూములు ఎక్కువున్నాయి. ఇదే స్థాయిలో భూమి లేని కుటుంబాలకు కొదవ లేదు. దీనికి తోడు గిరిజన కుటుంబాలు అత్యధికంగా వున్నాయి. మూడు దశాబ్ధాలల క్రితమే ఈ గ్రామంలో భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఢి.పట్టాలు ఇచ్చారు. అయితే ఈ పట్టాలు ఇచ్చేసమయంలో రెండు కుటుంబాలకు ఎవరో ఒకరిపేరున పట్టాలు ఇచ్చారు. సాగులో రెండు కుటుంబాలు వున్నప్పటికీ పట్టాలు ఒకరిపేరున ఇచ్చారు. అయితే జాయింట్‌ పట్టాదారుల్లో సాగులో వున్న మరో కుటుంబం ఆందోళనకు గురవుతోంది. పట్టాపై పేరున్నవారు అమ్మేసుకున్నారేమోనని భయపడుతున్నారు. జాయింట్‌ పట్టాను విడదీసి ప్రత్యేకంగా తాము సాగు చేస్తున్న భూమికి పట్టా ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

పాపం ఆమెకు తెలియదు

ఓ మహిళా రైతు ఇటీవల కలెక్టర్‌కు పెట్టుకున్న విన్నపంలో పొందుపరిచిన సర్వే నెంబర్‌ అసైన్డ్‌ భూమిని ఫ్రీహోల్డ్‌ చేసేశారు. వేరే వ్యక్తికి రిజిస్ర్టేషన్‌ కూడా జరిగిపోయింది. ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్‌లో ఆ సర్వే నెంబర్‌ కూడా కనిపిస్తోంది. ఈ విషయం తెలియని ఆ మహిళా రైతు తాము సాగు చేస్తున్న పొలానికి జాయింట్‌ పట్టాను విడదీసి ప్రత్యేక పట్టా ఇవ్వాలని కోరుతోంది.

Updated Date - Dec 30 , 2024 | 11:03 PM