ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TIDCO Houses నోటీసులొస్తున్నా.. టిడ్కో ఇళ్లు చూపించట్లే! Notices Arrive, But No Progress on TIDCO Houses

ABN, Publish Date - Dec 30 , 2024 | 10:44 PM

Notices Arrive, But No Progress on TIDCO Houses రుణాలు చెల్లించాలని బ్యాంకు నోటీసులిస్తున్నా.. తమకు టిడ్కో ఇళ్లు చూపించడం లేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ వద్ద మొరపెట్టుకున్నారు. సోమవారం సాలూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించారు.

అర్జీదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌

సాలూరు రూరల్‌, డిసెంబరు30 (ఆంధ్రజ్యోతి): రుణాలు చెల్లించాలని బ్యాంకు నోటీసులిస్తున్నా.. తమకు టిడ్కో ఇళ్లు చూపించడం లేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ వద్ద మొరపెట్టుకున్నారు. సోమవారం సాలూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా టిడ్కో లబ్ధిదారులు తమ సమస్య లను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఇళ్లు మంజూరైనా ఇప్పటివరకు చూపించలేదన్నారు. మరోవైపు బ్యాంకు నోటీసులకు సమాధానం చెప్పలేకపోతున్నామని తెలిపారు. తన భూమికి సంబంధించి వేరే వారికి 1బీ ఇచ్చారని పాచిపెంట మండలం గడివలసకు చెందిన లెంక దాలినాయుడు వినతి పత్రం అందించారు. పాచిపెంట ఎస్సీ కాలనీలో ఉంటున్న 150 కుటుంబాలకు భూములు, ఇళ్లు లేవని ఆ ప్రాంతవాసులు తెలిపారు. తోణాంలో భూ సర్వే చేపట్టాని రైతులు కోరారు. ఇలా మొత్తంగా పీజీఆర్‌ఎస్‌కు 106 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. వినతులు పెండింగ్‌లో లేకుండా చూడాలని సూచించారు. సాలూరులో విద్యుత్‌, రెవెన్యూ విభాగాలకు చెందిన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాబర్ట్‌పాల్‌, ఎంపీడీవో రమాదేవి, ఏవో పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 10:44 PM