పాలకొండ నగర పంచాయతీ చైర్మన్‌గా ప్రతాప్
ABN, Publish Date - Dec 25 , 2024 | 12:39 AM
పాలకొండ నగర పంచాయతీ చైర్మన్‌గా పల్లా ప్రతాప్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
పాలకొండ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీ చైర్మన్‌గా పల్లా ప్రతాప్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చైర్‌పర్సన్‌గా ఉన్న యందవ రాధాకుమారి ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ పదవికి ప్రతాప్‌ను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కె.కన్నబాబు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను నగర పంచాయతీ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు.. ప్రతాప్‌కు అందించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రావు.. ఎమ్మెల్యే జయకృష్ణ, టీడీపీ నాయకుడు పల్లా కొండలరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణను పల్లా ప్రతాప్‌తో పాటు పల్లా కొండలరావు కలిసి, సత్కరించారు. నగర పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించాలని, పాలకొండకు ప్రత్యేక నిధులతో మోడల్ హబ్‌గా చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
Updated Date - Dec 25 , 2024 | 12:39 AM