జమ్ములో ప్రబలిన అతిసారం
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:28 AM
మండలంలోని జమ్ము గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలింది.
గుర్ల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జమ్ము గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలింది. ఈ గ్రామంలోని సత్యం, రాములమ్మ, నారాయణ, ఆదినారాయణలకు వాంతులు, విరేచనాలు కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఈవోపీ ఆర్‌డీ వరప్రసాద్ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంచినీటి కుళాయిలు, వీధి కాలువలు పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. వేడినీరు తాగాలని సూచించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేకుండా మందులు పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో చేపలు, మాంసం వంటివి అమ్మడం, తినడం చేయరాదని చాటింపు వేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 12:28 AM