ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాణాలర్పించైనా బడిదేవర కొండను కాపాడుకుంటాం

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:59 PM

Ready to Sacrifice Lives to Protect Badidevara Konda ప్రాణాలర్పించైనా బడిదేవర కొండను కాపాడుకుంటామని పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. కొండపై గ్రానైట్‌ తవ్వకాల లైసెన్స్‌ రద్దు కోసం శనివారం కోరి గ్రామంలో విస్తృత ప్రజా సమావేశం నిర్వహించారు.

కొండపై గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని కోరుతూ ర్యాలీ చేస్తున్న గిరిజనులు

  • గ్రానైట్‌ తవ్వకాల లైసెన్స్‌ రద్దు చేయాలని డిమాండ్‌

  • కోరిలో విస్తృత ప్రజా సమావేశం

  • పోలీసుల బెదిరింపులను ఖాతరు చేయని గిరిజనులు

పార్వతీపురం రూరల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలర్పించైనా బడిదేవర కొండను కాపాడుకుంటామని పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. కొండపై గ్రానైట్‌ తవ్వకాల లైసెన్స్‌ రద్దు కోసం శనివారం కోరి గ్రామంలో విస్తృత ప్రజా సమావేశం నిర్వహించారు. అంతకముందు తానవలస నుంచి కోరి వరకు గిరిజనులందరూ సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అనంతరం బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వివిధ గ్రామాల నుంచి వస్తున్న ప్రజలకు రూరల్‌ పోలీసులు బెదిరించారు. అనుమతి లేని ఈ సమావేశానికి హాజరైతే కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో వారి మధ్య కొంతసేపు వాగ్వాదం చేటుచేసుకుంది. చివరకు ప్రజలు పోలీసుల బెదిరింపులను ఖాతరు చేయకుండా నాయకుల పిలుపుతో సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా బడిదేవరకొండపై క్వారీ పనులు చేపడుతున్నారన్నారు. గిరిజనులను ఆదుకొనే బడిదేవరమ్మ గుండెను కోసేస్తుంటే చూస్తూ ఊరుకునేదీ లేదన్నారు. ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉందని తెలిపారు. దీనిపై హైలెవెల్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత గతంలో లైసెన్స్‌ రద్దు చేశారన్నారు. ఇప్పుడు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు తెలియ జేయకుండానే లైసెన్స్‌ ఎలా పునరుద్ధరించారని ప్రశ్నించారు. దీనిపై ఆ శాఖ ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదో అర్థం కావడం లేదన్నారు. 20 ఏళ్ల కిందటే రెవెన్యూ, అటవీ శాఖలు కలిసి గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాయని, ప్రస్తుతం సంబంధిత అధికారులు ఏమీ మాట్లాడకపోవడం దారుణమని తెలిపారు. ఈ సమావేశానికి ఎటువంటి సమాచారం లేదని రూరల్‌ పోలీసులు శుక్రవారం సాయంత్రం నుంచే వాట్సాప్‌ ద్వారా నాయకులకు హెచ్చరిక నోటీసులు పంపడం, ఫోన్లు ద్వారా బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి బడిదేవరకొండపై గ్రానైట్‌ తవ్వకాలకు ఇచ్చిన లైసెన్స్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో అఖిల భారత, ఏపీ రైతు కూలి, ఆదివాసీ సంఘం, సీపీఐ నాయకులు బొత్స నరసింగరావు, ఎం.కృష్ణమూర్తి, శ్రీనుబాబు, అప్పలనాయుడు, రంజిత్‌కుమార్‌, సంగం, జీవ, దాసు, రాము, తొక్కుడవలస, తానవలస, సంగంవలస, కోరి, గంగాపురం, రావికోన, ఎంఆర్‌ నగర్‌ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:59 PM